ఈ రోజు
ఉదయం పేపర్ చూడగానే నన్ను అమితంగా ఆకర్షించిన వార్త గ్యాంగ్ లీడర్ సినిమాకు 25
యేండ్లు అనే వార్త. కారణం నేను మాటలు నేర్చుకొని కొద్ది కొద్దిగా సినిమా గురించి
ఆసక్తి కనబరుస్తున్న సమయంలో.. సినిమా అంటే వండర్ అనే భావనలో నేను బ్రతుకుతున్న
కాలంలో గ్యాంగ్ లీడర్ సినిమా రికార్డుల దుమ్ము దులుపుతుంది. అప్పటికి ఆ సినిమా
రిలీజ్ అయ్యి చాలా కాలం గడిచిపోయిందట.. శతదినోత్సవం కూడా జరుపుకుందట. అప్పటికి మా
ఊరికి ఆ సినిమా అప్పుడే విడుదల అయ్యింది.
చిరంజీవి,
విజయశాంతి, నిర్మలమ్మ, అల్లు రామలింగయ్య, మురళీమోహన్ తదితర తారాగణం, బప్పీలహరి
సంగీతం అందించిన సంగీతం అప్పుడు ఏ రేడియోలో విన్న దుమ్ము రేపుతుండేది. అలా నాకు
గ్యాంగ్ లీడర్ సినిమా గురించి తెలిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి