fathersday
నాన్నంటే నడిచే దైవం అన్నరు పెద్దలు . అమ్మ జన్మనిస్తే బాపు బతుకునిస్తడంటరు . తప్పటడుగులు వేసే బిడ్డని వేలుపట్టి లోకానికి పరిచయం చేస్తడు బాపు . బిడ్డలే లోకంగా .. వాళ్ళ బతుకును తీర్చిదిద్దడమే జీవితంగా బతికే ఫాదర్స్ కు స్పెషల్ డే ఈ రోజు .. అదే గురూ ఈ రోజు ఫాదర్స్ డే .. అమ్మ అప్యాయయత అయితే దానికి ఆకారం నాన్న . అమ్మ అమృతమైతే … దాన్ని నింపుకున్న కలశం నాన్న . అమ్మ వెలిగే దీపమైతే … దాన్ని వెలిగించే వత్తిలాంటి వాడు నాన్న . ఓక్క మాటలో చెప్పాలంటే నాన్న ఓ త్యాగాల గుర్తు .. వేలకట్టలేని మమకారానికి నిలువెత్తు రూపు . నాన్న కోరికలను తీర్చే గాడ్ .. బతుకును గాడిలో పెట్టే గైడ్ .. ఆదర్శంగా నిలిచే రోల్ మోడల్ .. పిల్లలు భాధల్లో ఉంటే ఫ్రెండ్ . గారాల పట్టీలకు ఆయనే ట్రెండ్ . మొత్తంగా చెప్పాలంటే .. నాన్న ఒక అద్భుతం .. అమ్మ ప్రేమ కంటి ముందుదైతే నాన్న ప్రేమ గుండెలోనిది . అమ్మంటే .. మెరిసే మేఘం .. నాన్నంటే నీలాకాశం అన్నాడు ఆనాడు సినీ కవి . నాన్నకున్న ఇంపర్టెన్స్ అలాంటిది మరి .. ఇక ఇప్పటి జనరేషన్ లో నాన్న ని ఓ ఫ్రెండ్ ల ట్రీట్ చేస్తున్నరు పిల్లలు . ఒకప్పుడు నాన్న కనిపిస్తే కం...