నాయకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం బాబుల్ గావ్. స్వాతంత్ర్యం సాధించి ఆరున్నర దశాబ్ధాలు గడుస్తున్న ఇప్పటికి దేశంలో చాల గ్రామాలకు కనీస సౌకర్యాలే లేవు. ఇలాంటి దౌర్భగ్యమైన స్థితిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కుగ్రామమే నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం బాబుల్ గావ్. 1500 జనాభా కలిగిన ఈ గ్రామానికి ఇప్పటికి దారి లేదు.. కరెంట్ లేదు.. రక్షిత మంచినీరు లేవు.. రోగమోస్తే ఆదుకునేందుకు ఓ డాక్టర్ గానీ.. ఆసుపత్రిగానీ లేవ్వు. ఉన్న చిన్నపాటి స్కూల్ కు టీచర్లు ఏ పదిరోజులకొసారిగాని రారు. సకల దారిద్ర్యాలు ఒకేచోట నివసిస్తే ఎలా ఉంటదో.. బాబుల్ గావ్ అచ్చం అలానే ఉంది. బాబుల్ గావ్ ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. రోగాల బారిన అనేక మంది చనిపోతున్న అధికారులు ఇప్పటికి స్పందించిన పాపన పోవడంలేదు. ఇక గ్రామాన్ని చుట్టుముట్టిన కౌలస్ వాగు దాటలంటే బ్రిడ్జి లేక అనేక మంది రోగులు కళ్లముందరే ప్రాణాలు విడుస్తున్నరు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారటం లేదంటున్నరు బాబుల్ గావ్ గ్రామస్తులు.. సర్కారు అధికారుల తీరు పట్ల తీవ్ర మనోవేదనకు గురవుతన్నరు బాబుల్ గావ్ పల్లే జనం. అధికారులు.ప్రజాప్రతిన...