పోస్ట్‌లు

జనవరి 31, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇదీ జీవితం..

చిత్రం
ఇదీ జీవితం..  పాలకుల నిర్లక్ష్యంతో పల్లెల్లో ఉపాధి కరువైంది. దాని ప్రభావం   బతుకుపై   పడింది. ఫలితంగా దుబాయి , సౌదీ , గల్ఫ్ ఫ్లైట్ ఎక్కక   తప్పని   పరిస్థితి . దళారులను నమ్మి బతుకు బాట పట్టినా.. అక్కడ ఉపాధిదొరుకుతుందన్న   గ్యారంటీ లేదు. ప్రాణాలతో తిరిగి వస్తమన్న   నమ్మకం లేదు. అలా ఎంతో   మంది జీవితాలు దళారుల దళాలి మాటలకు   బలైపోయినయి. అందుకే   కరీంనగర్ బస్టాండ్ నుంచి మొదలైన కన్నీటి ధార … సౌదీ ఎయిర్ పోర్ట్ లో   దిగేంత వరకు ఆగదు. అంతేనా.. అమ్మ వండిపెట్టిన   బువ్వ యాది.. బస్టాండ్ల తాను ఏడస్తూ కొంగుతో కొడుకు కన్నీళ్లు తూడుస్తున్న అమ్మమనాది.. గుండెలో బడిగంగ కొట్టినట్టు మొగుతుంటయి. పొద్దున ఐదుగొట్టంగనే లేచినవురా రాజుగా.. అని నాయిన పిలిచినట్టు పిలుపులు వినిపిస్తయి. దోస్త్ శినుగాడు మంచంలో పక్కన పడుకొని  సినిమాల గురించి మాట్లడుకున్న మాటలు  చెవుల నిండా వినిపిస్తుంటాయి. కొడవలి , సద్దిమూట పట్టుకొని  కైకిలు పోతున్నప్పుడు మోగే చెల్లె కాలి గజ్జెల సౌండ్లు గల్లుమని మోగినట్టనిపిస్తుంటయి. అన్న కొడుకు , అక్క కొడుకొ బాబాయ...