ఇదీ ఆసుపత్రే.. నమ్మాలి అంతే. ఇది నల్లగొండ జిల్లా కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా నలుముల ఉన్న పేద ప్రజలకు కొంతలో కొంత మెరుగైన వైద్యం అందించే ఏకైక ఆసుపత్రి.. పోయిన సంవత్సరంలో మే నెలలో ఈ ఆసుపత్రి స్దాయిని 250 పడకలనుంచి 400 పడకలకు పెంచుతున్నట్లు స్వయాన ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటూ జీఓ లను విడుదల చేసింది.. ప్రభుత్వం జీఓ విడుదల చేసి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా నిధులు విడుదల కాలేదు.. ఒక్క అదనపు సిబ్బందిని గానీ , డాక్టర్లను , వసతులను కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందక సౌకర్యాలు నేలపైనే పడుకుంటున్నరు. మాములు వాళ్ల సంగతి అలా ఉంచితే ప్రసవం కోసం వచ్చే మహిళలు పడకలు లేక నేలపైనే పడుకుంటూ పడరాని పాట్లు పడుతున్నరు. పేరు గోప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పేరుకేమో పెద్దఆసుపత్రి వసతులేమో చిన్నసుపత్రి అన్నట్లు తయారైందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు...
పోస్ట్‌లు
జనవరి 8, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది
చూసుకుందాం రండి...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
చూసుకుందాం రండి... టైగర్ ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. ప్రాజెక్టు వ్యతరేఖ నినాదాలతో ఆదిలాబాద్ కలెక్టరేట్ ను హోరెత్తించారు. బలవంతంగా మా మా భూమి నుంచి.. మా ఆత్మనుంచి మమ్మల్ని వేరు చేస్తే జోడేఘాట్ తరహాలో తిరగబడతమని గర్జించారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో కవ్వాల్ అడవినుంచి తమను పంపించి అనాథాలను చేయాలని చూస్తే కొమరంభీం వారసత్వ సత్తాను చూపుతామని హెచ్చరించారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం , బతుకుతున్న నేల కోసం ఎంతకైనా తెగిస్తామని... ఉన్న ఊరు - కన్నతల్లితో ఉన్న అనుభంధాన్ని తెంచాలని చూస్తే యుద్ధమే అవుతుందని ఆదివాసులు తేల్చిచెప్పారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో అభయారణ్యంలో 41 ఊర్లను ఖాళీ చేయాలని సర్కారు చేస్తున్న దుష్ట ప్రయత్నాలను తిప్పికొడతామని.. తమ బతుకులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోమని నిప్పులు చెరిగారు. పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారని వారి వ్యవహార శైలి రౌడీలను తలపిస్తున్నదని గిరిజన నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రాజెక్టు కోసం తమ గూడెంలో విష సర్పాలు వదులుతున్నారని, పులులను వదిలి భయపెట్టిస్తున...