భక్తజనంతో పులకించిపోతున్న మేడారం ! మేడారం జాతర దుమ్ము రేపుతుంది లక్షల మంది జనంతో కిటకిటలాడుతుంది. అమ్మలు గద్దెలకు రాకముందే భక్తజనంతో పోటెత్తడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇక జాతరలో మరోవిశేషమైన ఏర్పాటు హెలీప్యాడ్. ఆదివాసీల సంస్కృతీ సాంప్రదాయలకు వేదికైన మేడారం జాతర ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. హెలీకాప్టర్ ప్రయాణాలు, సీసీ కెమెరాల నిఘా, వాకీటాకీల మాటలు, కంప్యూటర్ జాతకాలు, బ్యాట్రీ ఆఫ్ టాప్స్ స్నానాలు, సెల్ ఫోన్ల హంగామా జాతరంతా కనిపించనుంది. కోయగిరిజన ఆచారం దెబ్బతినకుండానే లెటెస్ట్ టెక్నాలజీ వాడటం మేడారం జాతర స్పెషల్. దాదాపు మూడు జాతర క్రితం వరకు ఆధునిక సాంకేతిక పరిజ్జానం మేడారం జాతరలో పెద్దగా లేదు. ప్రస్తుతం సంప్రదాయ పద్దతిలోనే వచ్చి పూజలు నిర్వహించుకుని వెల్లేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. సమ్మక్క, సారలమ్మను గద్దెల వద్దకు తీసుకుని రావటం, వనప్రవేశం చేయించటం లాంటి ఆచార, వ్యవహారాలకు సంబందించిన పనుల్లో తప్ప మిగతా కార్యక్రమాలన్నింట్లోనూ కోత్తదనం ఉట్టిపడుతోంది. గతంలో మేడారం జాతరకు వివిధ ప్రాంతాలన...
పోస్ట్‌లు
ఫిబ్రవరి 3, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది