సమ్మక్క - సారలమ్మ చరిత్ర .. ఓ పరిశోధన !
సమ్మక్క - సారలమ్మ చరిత్ర .. ఓ పరిశోధన ! సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకున్తమనే విషయం అందరికి తెలిసిన.. అసలు సమ్మక్క ఎవరు..? సారలమ్మ ఎవరు? అన్న విషయాల పైన ఒక సందేహం మాత్రం కొనసాగుతున్నది. ప్రపంచంలోని ఏ దేవుడికైనా సరే అందరూ అంగీకరించే ఓ చరిత్ర ఉంటుంది. ఏ మతాచారానికైనా ఆ మతస్థులంతా నమ్మే ఓ ఆధ్యాత్మిక పునాది ఉంటుంది. ప్రతీ దైవ సన్నిధికి ఓ స్థలపురాణం ఉంటుంది. భూమ్మీది పుట్టి గిట్టిన ఎవరి ఉనికికి సంబంధించైనా కొద్దో గొప్పో చారిత్రక ఆధారం ఉంటుంది. చివరికి ఏ రాజవంశానికి సంబంధించిన జీవనం, యుద్ధాలకు సబంధించి శాసనాలుంటాయి. కానీ అవేమీ లేకున్నా వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఆచారం మేడారం జాతర. వరంగల్ జిల్లా మేడారంలో ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర చరిత్ర కారులకు, సాహితీ వేత్తలకు, ఆధ్మాత్మిక పరిశోధకులకు అందని ఓ మిస్టరీ. అంతుచిక్కని సమ్మక్క సారలమ్మ అసలు కథ తెలుసుకోవడానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన గతం ఏంటి అనేది కనీసం భవిష్యత్ లో కూడా తేల...