ఓ స్త్రీ రేపు రా ..!
ఒక దశాబ్ద కాలం క్రితం ఆంద్రప్రదేశ్ లోని పల్లెల్లోని ఏ ఇంటి గోడలపై చుసినా 'ఓ స్త్రీ రేపు రా ' అనే రాతలు కనిపించేవి. అప్పట్లో ఎవరో ఆడ దెయ్యం పల్లెల్లో తిరుగుతుందని ఆమె వారి ఇళ్ళ ముందు రాసిన మాటల్ని చదివి మరుసటి రోజు వస్తుందని.. అలా ఎప్పుడు వచ్చినా రేపు రా అని రాసింటుంది కాబట్టి ఆ దెయ్యం తమల్ని ఏమి చెయ్యదని నమ్మేవారు.. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చౌక ధరల టాబ్లెట్ పీ సీ ఆకాశ్ పరిస్థితి అలాగే ఉంది. గతంలో ఆకాశ్ నెం 1 విడుదల చేసినప్పుడు కపిల్ సిబాల్ గారు రాబోయే సంవత్సర కాలంలో కోటి మంది విద్యార్ధులకు ఆకాశ్ ను అందిస్తామని చెప్పారు.కానీ వాస్తవంలో ఒక్క నరేంద్రమోడికి తప్ప దాన్ని చూసే భాగ్యం ఎవరికీ కలగలేదు ( ఆకాశ్ టాబ్లెట్లు అకాశం లో తప్ప భూమి మీద కనిపించడం లేదంటూ ఎద్దేవా చేసినందుకు .. స్పందించిన కపిల్ సిబాల్ గారు ఇదిగో ఆకాష్ అంటూ పంపించారు అది తప్ప ఇప్పటి వరకు నేను ఆకాశ పీ.సీ ని చూశానని చెప్పిన మానవుడే లేడు ) కానీ స ర్కారు ఇప్పుడు ఆకాశ్ -2 ...