వాచ్ డాగ్ సర్వే .. ప్రపంచంలో నిజాయితీ పరులైన ప్రజలు ఎక్కడున్నరో తెలుసా.. ? చేయితడపకుండ పనిముట్టని లంచగొండులెవరో తెలుసా. ? లంచగొండుల దేశాల్లో మన ప్లేసేంటో తెలుసా.. ? అయితే ఓసారి జర్మన్ వాచ్ డాగ్ ఆర్గానైజేషన్ జరిపిన సర్వే చూడండి. లంచం.. ఈ మాట వింటే చాలు జనం హడలెత్తిపోతున్నరు. జేబులు తడుముకొని పరేషాన్ అవున్నరు. అడిగినంత ఇచ్చుకోకుంటే పనులు జరగవని బెంగపెట్టుకుంటున్నరు. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతయని ఖంగారుపడుతున్నరు. అందుకే లంచగొండులు అడిగినంత ముట్టచెప్పి పనులు చేయించుకుంటున్నరు. అప్పో సప్పో చేసి కాలం వెల్లదీసుకుంటున్నరు. లంచగొండిల చేతికి చిక్కి విలవిల్లాడిపోతున్నరు. లంచం అన్ని దేశాల్లో ఉంది. అయితే లంచగొండుల్లో ఫస్ట్ ఎవరన్న సందేహం చాల మంది బుర్రలను తొలుస్తున్న టైంలో.. లంచగొండిలపై విస్తృతంగా సర్వే చేసిన జర్మన్ వాచ్ డాగ్ ఆర్గానైజేషన్..ప్రపంచంలో సోమాలియన్లు..నార్త్ కోరియన్లు భయంకరమైన లంచగొండులని తేల్చింది. అంతే కాదు ప్రపంచంలో లంచాలకు దూరంగా ఉండే కంట్రీ న్యూజిలాండ్ అని ర్యాంకింగ్ ఇచ్చింది. లంచాలకు దూరంగా ఉండే జనాల్ని లెక్కలోకి తీసుకున్న వాచ్ డాగ్ సర్వే.. అతి ...