పోస్ట్‌లు

అక్టోబర్ 28, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
బాబువి లత్కోర్ రాజకీయాలు:కేసీఆర్     చంద్రబాబు ఇంటి పేరు నమ్మక ద్రోహం, ఒంటి పేరు నయవంచన,  అసలు పేరు కుంభకోణం అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసే రాజకీయాలన్ని లత్కోర్‌వేనని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఐదారు రోజులుగా చంద్రబాబు తొట్టిగ్యాంగ్ కారు కూతలు కూస్తుందని మండిపడ్డారు. బాబు చరిత్ర ప్రపంచానికి తెలుసన్నారు. ఆయన అవినీతి, దుర్మార్గాలపై పుంకానుపుంఖాలుగా పుస్తకాలు వచ్చాయని చెప్పారు. . అడుగుదీసి అడుగెస్తే బాబుది బినామీ బతుకు అని దుయ్యబట్టారు. తాను హెరిటేజ్ కంపెనీ, కూరగాయాల కంపెనీ పెట్టుకోలేదని చెప్పారు. అక్రమ సొమ్ము సంపాదించుకునే అలవాటు మీకుందని చెప్పారు. తాను నమస్తే తెలంగాణ దిన పత్రికలో రూ.4 కోట్లు, టీ న్యూస్‌లో రూ. 55 లక్షలు పెట్టుబడులు పెట్టానని తెలిపారు. ఈ డబ్బంతా మాజీ ఎంపీ వినోద్ తమ్ముణ్ణి వద్ద అప్పు తీసుకున్నానని పేర్కొన్నారు. తాను పెట్టిందంతా వైట్ మనీ అని స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణ ఎండీకి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు బయట వ్యాపారాలు ఉంటే మేం ఏం చేయాలని ప్రశ్నించారు. అది ఆయన ...