జయశంకర్
జయశంకర్ సార్... నీకు జోహర్. ఆ గొంతుది 60 యేండ్ల తండ్లాట.. విరామం లేని ఉద్యమ ఆలోచనల పాకులాట. ఏ చెయ్యి తెలంగాణ జెండా పట్టుకుంటదా.. అని ఎదురుచూపు. ఏ పిడికిలి చెయ్యెత్తి తెలంగాణకు జై కొడతాదా.. అనే ఆరాటం. పుట్టినకాడికెళ్ళి ... పాణం ఇడిచేదాకా.. తెలంగాణ సాధనే గమ్యంగా.. తెలంగాణ సాధనే లక్ష్యంగా.. జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి . ప్రాణం పోయేంత వరకు .. నమ్మిన సిద్దాంతం కోసం పోరాడిన వీరుడు .. ఊపిరి ఉన్నంత వరకు .. విలువలతో బతికిన బుద్దిజీవి . తన పేరులో ఉన్న జయాన్ని .. తన జీవితానికి అంకితం చేసుకున్న విజేత . నిబద్దతకు నిలువు గుర్తుగా.. నిజాయితీకి నిలువెత్తు రూపుగా.. మాటకు కట్టుబడ్డ మహామనిషిగా.. మానవత్వాన్ని రాజకీయాలకు .. జోడించిన మహనుభావుడిగా. సారును మరిచిపోవడం ఎట్లా . ఆయన మన కోసం.. మన ఆకాంక్షల కోసం.. మనం వేదనపడుతున్న సమస్య కోసం.. మనం కాలిబూడిదయ్యేందుకు కూడ.. వెనుకాడని ఆశ కోసం. తను ప్రాణం విడిచేంతవరకు .. పోరాడిన నిజమైన ప్రజల మనిషి.. సార్.. గురించి ఎన్నైన చెప్పొచ్చు... సార్ గురించి... చెప్పడమంటే.. విశ్వం గురించి వివరించడ...