మా భూమి
"మాభూమి" ఒక అద్భుతం .. మా భూమి సినిమాకు ముప్పయ్యేళ్లు నిండాయి. అన్ని సినిమాల్లాగే మా భూమినీ చూస్తే.. చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. తెలుగు సినిమాల్లో దేనికీ లేని ప్రత్యేకత ఈ సినిమాకు ఉంది. అందుకే.. మూడు దశాబ్దాలు గడిచినా.. ఇప్పటికీ అందరికీ గుర్తుకు వస్తుంది. ఇంతకీ.. మాభూమి గొప్పదనం ఏమిటి? ఇప్పుడు కూడా చర్చించుకోవడానికి కారణం ఏమిటి? సినిమా అంటే.. ఇమేజ్ ఉన్న హీరో ఉండాలి. ఒంపుసొంపులు చూపించే హీరోయిన్ ఉండాలి. హీరో ఇమేజ్‌ను చాటిచెప్పడానికి నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు.. ఓ వంద డైలాగ్‌లు ఉండాలి. ఇదీ 1980 నాటికి తెలుగు సినిమా పరిస్థితి. కానీ.. ఈ సమయంలో విడుదలైన మాభూమి సినిమాలో మాత్రం.. మనకు ఇవేవీ కనిపించవు. పేరున్న హీరోహీరోయిన్లు లేరు... హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన లేదు. జ్యోతిలక్ష్మి ఐటెం సాంగులూ లేవు.. కానీ.. అంతకుమించి.. హృదయాలను కదలించే కథ ఉంది. అదే ఈ సినిమా విజయానికి తొలిమెట్టయ్యింది. మాభూమి సినిమాలో గుండెల్ని పిండే సామాజిక అంశం ఉంది. నిజాంనవాబు దురాగతాలకు బలైన సామాన్యుడి ఇతివృత్తముంది. కడుపు మండి భూస్వాములపై తిరగబడ్డ సా...