కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందా? కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందంటూ టీడీపీ, సీమాంధ్ర నాయకులు విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌కు చెందిన నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. ఉద్యమాన్ని దెబ్బకొ ఈ కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందా? లేక పొత్తు పెట్టుకుంటామా? అన్నది రాష్ట్రం వచ్చిన తర్వాతి సంగతని చెప్పారు. ఇప్పుడు ఆ చర్చలు అనవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మరో సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకే తమ పార్టీ అధిష్ఠానం సంప్రతింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నదని ఆయన చెప్పారు. ప్రధానంగా సీమాంవూధుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు అన్ని పక్షాలతో సంప్రతింపుల ప్రక్రియను ముగించడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. ఉద్రిక్తతల నడుమ పరిపూర్ణ నిర్ణయం సాధ్యం కాదు కనుక తెలంగాణ ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని ఆయన విశ్లేషించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందంటూ టీడీపీ, సీమాంధ్ర నాయకులు తప్పుడు ప్రచారానికి దిగడం దారుణమని అన్నారు. ఉద్యమాన్ని ...