ముంబాయి.
ముష్కరులకు మనసుండదు.. మనసున్న అది స్పందించదు.. తనకు తాను అర్థం తేలియనోడు.. తన హింస ద్వారా జాతి ఆధిపత్యాన్ని చాటాలనుకనే వాళ్లు.. పిచ్చి పట్టిన సిద్దాంతాలను.. బాంబులతో రాద్దంతం చేసి.. రక్తం ఏరులై పారించి … మాంసం ముద్దల చెల్లాచెదురు చేసి.. రక్షసులకు.. తమకు ఏ తేడా లేదని నిరూపిస్తారు. అదే పవిత్రమని ప్రగల్భాలు పలుకుతారు.. పవిత్రమంటే … పరమ కిరాతకమా..? పవిత్రయుద్ధం అంటే … అణ్యం పుణ్యం ఎరుగని జనాన్ని దారుణంగా చంపడమా..? ఛీ … . స్కూల్ కి వెళ్లి అల్లారుముద్దుగా ఆడుకోవల్సిన ఓ పసిపాప.. శవలా గట్టలో శిథిలమై ఎందుకుండాలి..? తెల్లవారితే తన ఫ్రెండ్స్ తో బర్త్ డే చేసుకునే.. ఓ యువకుడు.. అచేతనుడై ఎందుకు పడిపోవాలి..? తన కుటుంబం కోసం … రేయింబవళ్లు పనిచేసి ఇంటికి వెళుతున్న.. ఓ పెద్దయాన శవమై ఎందుకు మిగలాలి..? ఆ కుటుంబానికి అండగా ఏవరుండాలి..? గుండెల్ని పిండెస్తున్న దారుణాలు … కుటుంబాల్ని చీల్చుతున్న ఘోరాలు.. ఇంకా ఎన్ని జరగాలి.. ఆ రాక్షసులు రక్త పిపాస ఎప్పుడు తీరాలి.. అట్లాంటి అల్లరి మూకలను … హీరోలుగా చిత్రంచే ఓ నీచపు సమాజమా.. ఓ దుర్మర్గాపు పా...