పోస్ట్‌లు

నవంబర్ 1, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
చీక‌టిని చీల్చే వెలుగు రేఖ దీపావ‌ళీ. మా అన్న కొడుకు ర‌ణ‌ధీర్ కి చీక‌టి అంటే అస‌లు భ‌య‌మే లేదు. (ఎందుకంటే వాడి వ‌య‌సు ఒక‌టిన్నర సంవ‌త్సరాలే కదా) అందుకే వాడు రాత్రి ప‌గ‌లు తేడా లేకుండా హాయిగా తిరుగుతుంటాడు. అంతేకాదు క‌రెంట్ పోతే చాలు వాడు క‌బుర్లు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వాడికి చీక‌టి గురించి తెలియ‌దు క‌దా.. అందులో ఎంత క్రౌర్యం ఉందో.. ఎన్ని ఘోరాలు జ‌రుగుతున్నాయో. అందుకే వాడు ప‌గ‌లు రాత్రి తేడా లేకుండా కాలాన్ని గ‌డిపేస్తుంటాడు.       నిజంగా నాకు అనిపిస్తుంది. మ‌నిషి త‌న ఉనికి తెలియ‌ని కాలంలో బ‌తికిన‌న్ని రోజులు భ‌యం సంతోషం, చీక‌టి వెలుతురు తెలియ‌కుండా బ‌తుకుతారు. కానీ జ్ఞానం వ‌చ్చింద‌ని గొప్పగా చెప్పుకునే వ‌య‌సుకు వ‌చ్చెస‌రికి మ‌నిషి ఎందుకు కృరంగా మ‌రిపోతున్నాడు. సాటి మ‌నిషిపై కోపం ద్వేషం, ఈర్షల‌తో ఎందుకు హ‌డాలెత్తిపోతున్నాడు. ఒక మ‌నిషిని నుంచి మ‌రో మ‌నిషి కాపాడుకోవాడ‌నికి ర‌క్షణ కావ‌ల‌సిన దుస్థితి మాన‌వ జాతికి  ఎందుకు వ‌చ్చిందో మ‌నిషి ఆలోచించుకోవ‌ల‌సిన స‌మ‌యం ఆస‌న్నమైంది. వేదం మ‌నుషులంతా స‌మాన‌మ‌ని ఘోషిస్తుంటే అలాంటి వేదాల‌ను చావు సిగ్నల్లుగా మార్చిన అజ్ఞా...