ఆదివాసులంటే అంత అలుసా..?
ఆదివాసులంటే అంత అలుసా.. ? మేడారం జాతరపై సర్కారుకు ఏం హక్కుంది ? అసలు సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఏం చేసిందని ? ఇంకా ఎన్నాళ్లు ఆదివాసులు పాలకుల పాదల కింద నలిగిపోవాలి ? వంద కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అన్ని హక్కులు పొడుచుకు వస్తాయా ? అధికారం ఉంది కదా అని అన్నిట్ని గుప్పిట్లో పెట్టుకోవడం సమంజసమేనా ? మేడారం జాతరకు సర్కారుకు సంబంధం ఎక్కడిది ? సర్కారు సహాయం కావాలని ఆదివాసులు పాలకులను ఏనాడైనా అడిగారా ? మాకు ఆదాయం కావాలని ఎవరితోనైనా చర్చలు జరిపారా ? మరి ఎందుకు సర్కారు పెత్తనం చేస్తుంది. ఎందుకు మేడారం జాతర పూజారులను అడుక్కునే వారిగా మిగిల్చుతుంది ? హుండీ ఆదాయం కోసం ఎందుకు దేబికరించే స్థితికి దిగజార్చింది ? షాపుల టెండర్ల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను ఏం చేస్తున్నారు ? ఎందుకు ఆదివాసీ ఆత్మబంధులు ఇలవేల్పు గద్దెలపై పోలీసు బూట్లను ప్రవేశపెడుతుంది ? ఎందుకు ఆదివాసీల గుండెలపై తుపాకులను ఎక్కుపెడుతుంది ? ఎందుకు పరమ పవిత్రంగా భావించే సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల చుట్టు ఇనుపకంచెలు వేసి బంధిస్తుంది. అధికారం ఉన్నది ప్రజల మనోభావాలన...