పోస్ట్‌లు

ఫిబ్రవరి 1, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో..

చిత్రం
ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో..  (ఉంటే వీళ్లకు వైద్యం అందాలి కదా)     అంతరిక్షానికి అప్ అండ్ డౌన్ చేస్తున్న ఈ రోజుల్లోనూ మూడనమ్మకాలు రాజ్యమేలుతున్నయి. కడుపు నొప్పి వస్తే.. చెంబు వైద్యంపై ఆధారపడి జీవితాలను ఆగం చేసుకుంటున్నరు ఏజెన్సీ ఆదివాసులు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడనమ్మకాలను నిర్ములిస్తున్నమంటున్న ఐటీడీఏ అధికారుల మాటలు.. పచ్చి అబద్దాలని నిరూపిస్తున్నది ఖమ్మం జిల్లా ఏజెన్సీ. ఇంజక్షన్లు.. గ్లూకోజులు.. ఆపరేషన్లు.. ఎక్సరేలు.. స్కానింగ్ లు.. ఎంజీయోగ్రామ్ లు ఒక్కటేమిటి ఎన్నో అధునిక పరికరాలు.. అయినా రోగం తగ్గుతుందన్న గ్యారంటీ లేని రోజులివి. అట్లాంటిది ఓ చెంబు వైద్యంతో కడుపు నొప్పి తగ్గుతుందని నమ్ముతున్నరు అమాయక ఆదివాసులు. అలా నమ్మే ఒక్కొసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నరు. ఖమ్మం జిల్లాలోని భద్రచలం ఏజెన్సీలోని చింతూరు మండలం సరివెల గ్రామంలో కడుపు నొప్పికి  ఈ చెంబు వైద్యం ఫేమస్. గూడెంలో ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిందంటే చాలు వెంటనే గ్రామంలో ఉన్న చెంబు డాక్టర్ దగ్గరికి పరుగులు పెడతరు. ఇక చెంబు వైద్యునితో చికిత్స తీసుకుంటరు. కడుపునొప్పి వచ్చిన రొగి...

ఎంత దారుణం...

చిత్రం
ఎంత దారుణం... అమ్మ ఒడిలో ఒదిగిపోవాల్సిన పసిపాపలు.. చెత్త కుప్పల్లో ప్రత్యక్షమవుతున్నారు. తల్లి ముద్దు.. మురిపాలతో తడిసిపోవాల్సిన బంగారుకొండలను.. కుక్కలు పీక్కుతింటున్నయి. కన్నవాళ్ల రాక్షసత్వానికి నిన్న ఒక్కరోజే ఇద్దరు పసివాళ్లు ప్రాణాలు విడిచిన్రు. మురికి గుంటల్లో పందులకు, కుక్కలకు ఆహారమైన్రు. గుండెలను కలిచివేసిన పాలబుగ్గల పసిపాపల మరణాలపై  సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న విజయవాడలో ఓ పసిగుడ్డు మరణం..నిన్న ఢిల్లీ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పలక్ అనే పసిపాప ఘటన. ఈ రెండు మరవకముందే మరో రెండు ఘటనలు. అది రాజధాని నడిబొడ్డలో అయితే.. మరోటి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. p ఈ పసిపాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ ఎల్బీనగర్ లోని చెరువు గట్టుపైన వదిలివెల్లిన్రు. గుక్కపట్టి ఏడ్చీన పాప చివరికి ఊపిరి విడించింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పసిపాపను చూసి విషయం స్థానికులకు చెరవేసిండు. దీంతో తండోపతండాలుగా వచ్చిన జనం.. హృదయవిదారకమైన సీన్ను చూసి కంటతడిపెట్టిన్రు. పసిపాపను వదిలివెళ్లిన మృగాలకు శాపనార్థాలు పెట్టిన్రు. p ఇక అదిలాబాద్ జిల్లా...