మన దొరలు.. కోయదొరలు.. (కుర్రో..కుర్రుర్రు..)
మన దొరలు.. కోయదొరలు.. (కుర్రో..కుర్రుర్రు..) కుర్రో కుర్రు అంటు మేడారంలో కోయదొరలు హల్చల్ చేస్తున్నరు.తమదైన శైలిలో డైలాగ్స్ చెబుతు జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నరు. అంతేకాదు భక్తుల జాతకాలను చెబుతు బిజీబిజీగా గడుపుతున్నరు. తలపై నెమలీకలు.. చేతులకు చెట్టువేళ్ల కడియాలతో.. మేడారం జాతరలో ధూంధాం చేస్తున్నరు కోయదొరలు కొయదొర పలుకులు-1 కుర్రో కుర్రు.. కొండ దేవర పిలుపు.. సమ్మక్క పిలుపు సారవ్వ పిలుపు.. అబ్బబ్బ ఆదిశక్తి..పరా శక్తి కర్రుర్రుర్రు.. దేవర.. కొండ దేవర.. అమ్మవారి పొలిమెరా కాసేటి పోతలింగుకు.. ద్సూ..స్ తస్సాదియ్యా... కుర్రో.. కుర్రుర్రుర్రు.. కొండదేవరా పిలుపు.. సమ్మవ్వ పిలుపు.. సారవ్వ పిలుపు ఈ డైలాగులు మేడారం జాతరలో హవా చేస్తున్నయి. అబ్బబ్బ ఆదిశక్తి..పరా శక్తి కర్రుర్రుర్రు.. అంటూ కొండదొరలు పలుకుతున్న మాటలు ...