ప్రభుత్వాలు మానవత్వం మరిస్తే..
ప్రభుత్వాలు మానవత్వం మరిస్తే.. (ప్రజలుతమనుతాముచంపుకోల్సిందే) పుట్టిన ప్రతి మనిషి నిండు నూరేళ్ళు బతికుండాలని కోరుకుంటాడు. కానీ కరీంనగర్ జిల్లాలో కట్ల శ్రీనివాస్ మాత్రం తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. చికిత్సలేని రోగంతో గత 22 సంవత్సరాలుగా అనుభవిస్తున్న నరకయాతన నుంచి తనకు విముక్తి ప్రసాదించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. కండరాల క్షీణతతో జీవచ్చవంలా మారి.. సర్కారు సహాయం లేక MERCY KILLING కోరుతున్నడు కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన శ్రీనివాస్ 1988లో డిగ్రీ చదువుతున్నప్పుడు కండరాల క్షీణత (మస్క్యూలర్ డిస్ట్రోఫి) వ్యాధి సోకింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఫలితం లేదు. లక్షలు ఖర్చు చేసిన రోగం నయం కాలేదు. దీంతో అతను గత 22 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై జీవచ్చవంలా బతుకుతున్నాడు. చేతుల్లో కొద్దిగా చలనం ఉన్న.. కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఎవరి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్న శ్రీనివాస్ కు తల్లిదండ్రులే సేవలు చేస్తున్నారు. చికిత్సలేని రోగంతో బాధపడుతున్న తాను చావడానికి సిద్దంగా ఉన్నానని.. ప్రభుత్వం కారుణ్...