పోస్ట్‌లు

మే 8, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలంగాణ‌లో రెండు పార్టీల న‌డుమ దోబుచులాడుతున్న విజ‌యం

చిత్రం
          తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో తెలియ‌క రాజ‌కీయ పార్టీలు స‌త‌మ‌త‌ముతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ నాయ‌కులు విజ‌యం సాధిస్తామ‌ని పైకి ధీమ‌గా చెబుతున్నా లోలోన మాత్రం విజ‌యంపై ఆందోళ‌న‌లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా త‌న కార్య‌క్ర‌మాల‌ను త‌ను చేస్తూ త‌న మార్క్ పాలిటిక్స్‌కి తెర‌లేపుతుంది. ఇటు ప‌క్క ఎంఐఎం, అటు సీపీఐ పార్టీల‌తో చ‌ర్చ‌ల‌కు తెర‌లేపుతుంది. అందులో భాగంగానే టీపీసీసీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య ఎక్కే గ‌డ‌ప దిగే గ‌డ‌ప ఎక్కుతూ రాబోయే తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.     ఇక ఎంఐఎం నాయకులు కేసీఆర్ తో వెళితే లాభామా కాంగ్రెస్ తో ఉంటే లాభామా అని లెక్కలు వేసుకుంటున్నారు. సీపీఐ నారయణ నిమిషానికో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చింది కేసిఆర్ అంటూనే సోనియా చలువ వల్లే తెలంగాణ వచ్చింది కదా అంటూ రెండు నాల్కల ధోరణిని కనబరుస్తున్నారు. ఇక తెలంగాణ ప్రజలపైనే పూర్తి భారం ఉంచిన కేసిఆర్ తప్పకుండా తమ ప్రభుత్వం ఏర్పడుతుందని అందులో కించత్ సందేహం లే...