పోస్ట్‌లు

అక్టోబర్ 18, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

దోచుకోవడం.. దాచుకోవడమే వారి పని..

చిత్రం
      రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించినంత పని చేసిన బ్రిటీష్ వాళ్ళు.. ప్రపంచం లోని దాదాపు అన్ని దేశాల సంపదతో పాటు.. విజ్ఞాన సర్వస్వాన్ని దోచుకుపోయారు. అయితే బ్రిటీష్ పాలకుల బానిసత్వం లోని అన్ని దేశాలు.. స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాక  .. తమ సాంస్కృతిక చిహ్నాలను తిరిగితెచ్చుకున్నాయి.అంతే కాదు తమ మేధో సంపత్తితో సృష్టించిన అనేక అద్భుతాల హక్కులను సాధించుకున్నాయి. కానీ విశాలమైన భారతావని మాత్రం ఆ పని చేయలేక పోతుంది. పాలకుల నిర్లక్ష్యం..పరిశోధకుల నిర్లిప్తత మన ఆవిష్కరణలకు ప్రమాడం లోకి నేట్టేస్తున్నాయి.         నిన్న మొన్నటి వరకు.. పసుపు, వేపాకు, కుంకుమ పువ్వు, కరివేపాకును తామే కనుగొన్నామని తెల్లోల్లు అంతర్జాతీయ పేటెంట్ కోసం అప్లై చేసేదాకా కూడా మనవాళ్ళు ఆ సంపద తమదని పేటెంట్ తీసుకోక పోవడం నిజంగా సైంటిస్టుల తప్పిదమే. పరిశోధనల మీద వేల కోట్లు దారపోస్తున్న ఒక్క ఆవిష్కరణ కొత్తది లేకపోవడం కలవార పరిచే నిజం.         ఎందరో భారతీయ మేధావులు తమ అద్బుత మేధోశక్తితో  రాసిన అమూల్యమైన అనేక గ్రంధాలు విదేశీ లైబ్రరీలలో...