ఒక దశాబ్ద కాలం క్రితం ఆంద్రప్రదేశ్ లోని పల్లెల్లోని ఏ ఇంటి గోడలపై చుసినా 'ఓ స్త్రీ రేపు రా ' అనే రాతలు కనిపించేవి. అప్పట్లో ఎవరో ఆడ దెయ్యం పల్లెల్లో తిరుగుతుందని ఆమె వారి ఇళ్ళ ముందు రాసిన మాటల్ని చదివి మరుసటి రోజు వస్తుందని.. అలా ఎప్పుడు వచ్చినా రేపు రా అని రాసింటుంది కాబట్టి ఆ దెయ్యం తమల్ని ఏమి చెయ్యదని నమ్మేవారు..
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చౌక ధరల టాబ్లెట్ పీ సీ ఆకాశ్ పరిస్థితి అలాగే ఉంది. గతంలో ఆకాశ్ నెం 1 విడుదల చేసినప్పుడు కపిల్ సిబాల్ గారు రాబోయే సంవత్సర కాలంలో కోటి మంది విద్యార్ధులకు ఆకాశ్ ను అందిస్తామని చెప్పారు.కానీ వాస్తవంలో ఒక్క నరేంద్రమోడికి తప్ప దాన్ని చూసే భాగ్యం ఎవరికీ కలగలేదు ( ఆకాశ్ టాబ్లెట్లు అకాశం లో తప్ప భూమి మీద కనిపించడం లేదంటూ ఎద్దేవా చేసినందుకు .. స్పందించిన కపిల్ సిబాల్ గారు ఇదిగో ఆకాష్ అంటూ పంపించారు అది తప్ప ఇప్పటి వరకు నేను ఆకాశ పీ.సీ ని చూశానని చెప్పిన మానవుడే లేడు ) కానీ స ర్కారు ఇప్పుడు ఆకాశ్ -2 ను తీసుకు వచ్చింది .. ఇదైన ఇప్పుడు మార్కెట్లోకి విడుదల అవుతుందా అంటే..రాబోయే 5 ఏళ్ళలో 22 కోట్ల మందికి అందిస్తారట కానీ ఇప్పుడు మాత్రం లేవంటా.. ఈ మాటలు చూస్తుంటే ఓ స్త్రీ రేపు రా ..! గుర్తుకు రావడం లేదూ.. అదన్నమాట ఆకాష్ టాబ్లెట్ల కథ . ఇప్పుడు మన మంత్రుల నినాదం ''ఓవిద్యార్ధి ఆకాశ్ రేపు తీస్కో '' ( ఎలక్షన్స్ అయ్యాక ఈ నినాదాన్ని కాస్త మార్చి '' ఓవిద్యార్ధి ఆకాశ్ లైట్ తీస్కో '' అని సింపుల్ గ చేబుతారన్నమాట. ఎంతైనా రాజకీయ నాయకులు కదా అన్ని ఆలోచించే పనులు మొదలు పెడతారు. )

hahahh...
రిప్లయితొలగించండిgood impressive story.