తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

30 అక్టోబర్, 2012

నువ్వొక ఒంటరివి..!

దేశం లో  జనం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న 
మనుషులు మాత్రం ఒంటరవుతున్నారు ..
ఏది తేకున్న అన్నీ కోల్పోయినట్టు..
అంతా నాశనం అయినట్టు..
వెలుగులు విరజిమ్ముతున్న కాలం 
కారు చికట్లలో మగ్గినట్టు..
బంధాల దొంతర ఎడబారినట్టు..
మనిషనే మమతను 
కిలోమీటర్ల కింద పతిపెట్టినట్టు..
ఎక్కడికో పయనం..
మరెక్కడో గమ్యం..!!



కత్తుల సావాసం కటకటలా నెడితే..
అమ్మ కాదుకదా దాని జేజమ్మ వచ్చినా కాపాడలేదు..
న్యాయం నీన్ను విడిస్తే.
గుర్తుంచుకో బ్రదర్ 
మంచి ముందు కస్టపెడుతుంది..
చెడు తర్వాత చుక్కలు చూపిస్తుంది..
దాని బారిన పడితే ఎండ్ లేదు.

క్యాష్ కోసం క్యారెక్టర్ చంపుకుంటే..
దానమ్మ అది ...
నువ్వు చెంచల్ గూడ జైల్లో ఉన్న వదిలిపెట్టాదు..
నిన్ను అధపాథలం తోక్కేదాకా.
కాసులకున్న కమిట్మెంటే అది మరి.

మనం సృష్టించిన మనీనే కదా అని 
ఆటలడేవు సెహ్వాగ్ సిక్స్ లాగ నిన్ను 
లైఫ్ బౌండరి బయటికి విసిరికోడతది.

అయినా నా ఇష్టం అంటే   
అది నీ ఇష్టం సోదరా..
తినే పిడికెడు తిండి కోసం..
విలువల వలువలుడదీసి..
చెర్నాకోల చేతబట్టి మానవత్వం వీపుపై
విమానం మోగించి..
ఏం సాధిస్తావు 
ఒంటరిగా మిగలటం తప్పా ..
నింగి నేలను చూస్తూ పిచ్చివానిగా మిగలటం తప్పా ??
పో...
నీ దారిన..
సమాజమే మనుషుల మైండ్ల నిండా 
మనీ ప్రోగ్రాం ఫిక్స్ చేసి షో చూస్తున్నప్పుడు 
నువ్వు మాత్రం ఎం చేస్తావు క్రిమినల్..
నీ క్యారెక్టర్ నీకుంది..
సొసైటీ ఫిలాసఫీ సొసైటీకి ఉంది..
ఇక్కడ మారాల్సింది..
ఎవరోమారి తేలాల్సి ఉంది..
ఏమో మరి..     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి