తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

02 నవంబర్, 2012

వివాదంలో దేనికైనా రెడీ..!

వివాదంలో తెలుగు సినిమా రంగం.. 
దేనికైనా రెడీ అంటున్న బ్రాహ్మణులు.
హీరోల వెకిలి ఆలోచనలతో.. డైరెక్టర్ల సృజనాత్మక లోపాలతో తెలుగు సినిమా రంగం వివాదాలకు..వెకిలి వేషాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది.. మొన్నటికి మొన్న తెలంగాణా ప్రజల మనసులకు గాయం చేసిందని ఓ సినిమాపై పెద్ద దుమారం రేగి సర్కారు జోక్యం తో 16 కట్లతో బయటపడ్డ ఆ సినిమా ఇప్పటికి కోలుకోలేక పోతుంది.
   ఆ వివాదం మరువక ముందే మంచి విష్ణు నటించిన దేనికైనా రెడీ బ్రాహ్మణుల ఆగ్రహావేశాలతో విలవిల్లాడిపోతుంది. బ్రహ్మనులపై విష్ణు అనుచరులు కర్రలతో దాడి చేసి గాయపరచడంతో.. బ్రాహ్మణ ప్రతినిధులు విష్ణు పై చెప్పులు విసిరి నిరసన వ్యక్తం చేసారు. 

       ఒకరి మనసులు గాయం అవుతాయి అనుకున్నప్పుడు..ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి అనుకున్నప్పుడు అలంటి సినిమా ఎందుకు తీయాలి. సినిమా అనేది క్షణిక ఆవేశం కాదు.. అనుకోకుండా తీసాం అని సర్ది చెప్పుకోవడానికి.. కొన్ని నెలలపాటు షూటు, రీషూట్లు చేసే సినిమాల్లో వివాదాలు ఉండటం కచ్చితంగా కావాలనే తీసారని భావించవలసి వస్తుంది. ఇంకా కొందరు జ్ఞాన శూన్య దర్శకులు కావాలనే వివాదాస్పద కథలను తీస్తున్నారు. ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఈ విధానం మారకుంటే తెలుగు సినిమా రంగం ఉనికి కోల్పోక తప్పదు. అంతే కాదు వివాదాలు చుట్టుముట్టి సినిమా ఆడకపోతే నిర్మాతల జీవితాలు వీధిపాలుకాక తప్పదు.      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి