డ్రాగన్ దెబ్బకు....తుస్ !

      చైనీయుల చోరకళ  ముందు.. ప్రపంచం లో ఎవ్వరైనా దిగదుడుపేనని నిరూపించింది ఆసోచాం సర్వే. అతి పవిత్రంగా జరుపుకునే దీపావళి పండగ అంటే భారత దేశంలో ఒక క్రేజ్.  ఇక దీపావళి టపాసులంటే ఓ స్పెషల్. అందుకే ప్రపంచంలో మరే దేశంలో లేనంత ఫైర్ వాల్స్ డిమాండ్  భారత దేశంలో ఉంది. వందల కోట్ల వ్యాపారం ఒక్క సెషన్ లో జరుగుతుంది.


     సరిగ్గా వీటిపైనే చైనీయుల కన్ను పడింది. కాపీ కొట్టడంలో డబుల్ పీహెచ్ డీ  చేసిన చైనా చోర్ బ్యాచ్ మన దేశం లోని అన్ని రకాల టపాసులను వాటి పై ఉండే హిందూ దేవతల బొమ్మలతో సహా కాపి కొడుతుంది. అంతే కాదు వాటిని అతి తక్కువ ధరకే మన మార్కెట్ లోకి వదులుతుండటం.. తక్కువ ధరకే దొరికే వస్తువులను విరగబడి కొనే మన సగటు జనం 74 % చైనా  టపాసులను కొనడానికి ఆసక్తి చుపిస్తుండటంతో మన దేశీయ టపాసుల వ్యాపారం తుస్సుమంటుంది. అంత ఇంత కాదు 1800 కోట్ల రూపాయలు అక్రమంగా చైనాకు తరలి పోతున్నాయి.. చైనా అక్రమ సరుకుకుల మూలాన దేశీయ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని అసోచాం నివేదిక స్పష్టం చేసింది.  ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి చైనా అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానిక వ్యాపారాలు కోరుతున్నారు.  

కామెంట్‌లు

  1. చైనా సరకులను అడ్డుకునే బదులు మనమే ఇంకా చౌకగా తయారు చేయడానికి ప్రయత్నించాలి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రిటైర్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్న టీ-సర్కారు

17 సెప్టెంబర్ - తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగ అంశాలు...

సర్వరోగాలను నయం చేసే బ్రహ్మస్త్రం ఈ దివ్యఔషదం