తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

20 నవంబర్, 2014

తెలుగులో నేను నిర్మించిన కొత్త మాట‌

మిత్రులారా..?

నేను నా వృత్తిరిత్యా నేను ఓ తెలుగు ప‌దాన్ని నిర్మించే ప‌ని చేప‌ట్టాను. అందులో భాగంగా నేను నిర్మించిన కొత్త ప‌దం
ఈవ్ టీజింగ్ = స్త్రీ దుర్ వేధింపులు లేదా స్త్రీ దుర్వేధింపులు లేక మ‌హిళాదుర్వేధింపుల చ‌ట్టంగా ఉంటుంద‌ని భావించాను.
ఎందుకంటే ఈవ్ అనే ఇంగ్లీష్ ప‌దానికి సంద‌ర్భం అని అర్థం.
టీజింగ్ అనే ప‌దానికి వేధింపులు లేక బాధించుట అని అర్థం ఉంది.
 అయితే ఇంగ్లీష్ భాష యొక్క స‌ర‌ళ‌త్వం దృష్టా అది క‌చ్చితంగా మ‌హిళ‌ల‌ను వేధించ‌డ‌మే అనే అర్థం అంద‌రికి తెలిసిపోయింది. అదే ప‌దాన్ని స‌రిగ్గా తార్జామా చేస్తే వేధింపుల సంద‌ర్భం , బాధింపుల సంద‌ర్భం అనే అర్ధాలు వ‌స్తున్నాయి. కానీ ఇది ప‌ల‌క‌డం చాలా ఎబ్బెట్టుగా, అసంద‌ర్భంగా ఉంటుంది. అంతేకాదు వేధింపులు అంటే తెలుగులో విశాల‌మైన అర్థం క‌లిగిఉంది. కాబ‌ట్టి ఎవ‌రిని వేధిస్తున్నారు అనే విష‌యం కూడా తెలియాలి. అంతేకాదు ఇది స‌త్‌సాంప్ర‌దాయం కానందున దీన్ని దుర్ అనే ప‌ద ప్ర‌యోగం వాడ‌టం స‌రిపోతుంద‌ని నా మ‌న‌సుకు తోస్తుంది. అందుకే
ఎవ‌రిని వేధిస్తున్నారో తెలిసేలా..
టీజింగ్ అంటే వేధించుట‌
అది మంచి ప‌ని కాద‌ని తెలిసేలా ద‌ర్ నే విష‌యాన్ని చెప్ప‌డం.

ఈ అన్ని విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకొని నేను ఈవ్ టీజింగ్‌కు కొత్త‌గా నిర్మించిన తెలుగు ప‌దం స్త్రీదుర్వేధింపులు.
దీని పై భాషాభిమానులు, భాషాప్రేమికులు త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తార‌ని ఆశిస్తూ...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి