తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

20 ఏప్రిల్, 2016

తెలంగాణ రేపటి ఆశాదీపం


తెలంగాణ నిండా యువత కోటి ఆశలతో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంది. నిన్నటి వరకు జీవితాలను ఫణంగా పెట్టి స్వరాష్ట్రం కోసం పోరాడిన యువత నేడు సాధించుకున్న రాష్ట్రంలో సరికొత్త జీవితాలను ప్రారంభించాలని ఆశగా ఎదురుచూస్తుంది. తెలంగాణ బరిగీసి పోరాడి అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడటంలో సఫలమైన ఉద్యమపార్టీ టీఆరఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టిన సందర్భం ప్రతి ఎలక్షన్లలో ప్రతిబింబిస్తున్నదే.
            ఇక ఇప్పుడు తెలంగాణకు సరికొత్త ఆశదీపంగా కనిపిస్తున్న ఒకే ఒక్క పేరు కేటీఆర్. నిజానికి తెలంగాణ సామాన్యులకు టెక్నాలజీని దగ్గరగా చేసేందుకు విశ్వప్రయత్నంచేసి సఫలం అయిన ఐటీ మంత్రి.. టీహబ్, టాస్క్ ద్వారా తెలంగాణ యువతకు, విద్యార్ధులకు మెరుగైన జీవితాన్ని ప్రసాదించాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ ప్రయత్నంలో కేటీఆర్ అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. భారత దేశంలో అత్యున్నత పరిపాలనను చేస్తున్న నాయకులకు ఇచ్చే మోస్ట్ ఇన్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ మొదటి సంవత్సరంలోనే సొంతం చేసుకున్నాడు. అంతేకాదు బిగ్ బెస్ట్ స్టేట్ అవార్డ్ ఇన్ ఇనఫ్రాస్ట్రక్చర్ అవార్డ్ – 2014          అవార్డును సైతం సొంతం చేసుకొని తెలంగాణ ప్రతిష్టను సగర్వంగా ప్రపంచానికి చాటడంలో కేవలం ఒక్క కేటీఆర్ చొరవే పనిచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవే కాదు హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ సంస్థలు క్యూ కట్టేలా చేయడంలో కేటీఆర్ గారి పనితనమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.


కేటీఆర్ చొరవ ఫలితంగా హైదరాబాద్ లో ఏర్పాటైన సంస్థలు –

గూగుల్ క్యాంపస్   - కాలీఫోర్నియా బయట గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద కంపెనీ క్యాంపస్     హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతుంది.

అమెజాన్ - అమెరికా బయట ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తుంది.
అది పది ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తుండటం అమోజాన్ సెకెండ్ ఇన్నింగ్ గా చెప్పుకోవచ్చు

హ్యాట్సాఫ్ టూ కేటీఆర్.

3 కామెంట్‌లు: