01 ఆగస్టు, 2019
రిటైర్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్న టీ-సర్కారు
పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బాగోగుల గురించి పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తర్వాతే ఎవరైన అన్నట్టు ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రిటైరైన రోజున సన్మానంతో పాటు అన్ని చెల్లింపులు, గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఉద్యోగిని తన ఇంటి వద్ద దింపేసే ఏర్పాట్లు చేయాలని కసరత్తులు చేస్తున్న సర్కారు, ఇంతకు ముందే రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించింది.
వారు నిత్యం మీసేవా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంట్లో కూర్చుని సర్కారు తెస్తున్న టీయాప్ లో ఒక ఫోటో దిగి వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. ఇక ఆ ఉద్యోగికి ప్రతి నెల బ్యాంకు అకౌంట్లో ఫించను జమ అవుతుంది. ఇప్పటి వరకు ఈ విధానం చైనాలో అమల్లో ఉంది. అయితే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి రేపో మాపో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది.
ఆల్ ది బెస్ట్ టీ-సర్కార్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Latest Govt. Jobs | SSC Job
రిప్లయితొలగించండి