నిజమైన నాయకులు ఎలా ఉంటారు ?

వంద మంది శత్రువులతో నేను ఒంటరిగా పోరాడుతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడికి తన వ్యథను చెప్పుకున్నప్పుడు.. శ్రీకృష్ణుడు, అర్జునుడితో ఇలా అన్నాడు... "నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్" ధర్మం కోసం నిజాయితీగా పోరాడితే వందమందిని కూల్చే శక్తి నీకు విశ్వం నుంచి లభిస్తుంది అని చెప్పాడు. అదే పుతిన్ విషయంలో జరిగి ఉండవచ్చని నా భావన. లేదంటే, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 24, 2022 ప్రారంభమైంది. అంటే అక్షరాలా 4 సంవత్సరాల, 1 నెల, 24 రోజులు. బహుషా చరిత్రలో జరిగిన సుదీర్ఘ యుద్ధాల్లో ఏదో ఒక స్థానంలో ఈ యుద్ధానికి కూడా చోటు లభించి ఉండవచ్చు. అయినప్పటికి పుతిన్ ఎవ్వరి సహాయం అడగడం లేదు, ఎవ్వరిని నిందించడం లేదు, ఎవ్వరిపై నిందలు మోపలేదు. యూరప్, అమెరికా వంటి శక్తివంతమైన కూటములు, దేశాలు ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్నప్పటికి ఎక్కడా చెక్కుచెదరలేదు. పైగా రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించి అమెరికా చేసిన ఆర్ధిక విధ్వంసాన్ని కూడా చాలా ప్రొఫెషనల్ గా ఎదుర్కొంటున్నాడు పుతిన్. దాదాపు 4 లక్షల మంది సైనికులను కోల్పోయాడు, దాదాపు 300 బిలియన్ డాలర్లు తన సంపదను స్తంభింపచేసినప్పటికి ఎక్కడా వణకలేదు. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్ని తన శత్రువువైపు నిలబడ్డప్పటికి ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. ఇప్పటికి స్థిరంగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. యుద్ధం మంచిదని నేను ఇక్కడ చెప్పడం లేదు. అయితే, రెండు నెలల యుద్ధానికే సర్కస్ లో కోతి మాదిరిగా గంటకో స్టైల్, పూటకో డైలాగ్, రోజుకో బెదిరింపుతో అమెరికా అగ్రరాజ్య పరువును గంగలో కలిపేసాడు. ఇప్పటిదాక అమెరికన్లంటే సూపర్ హ్యుమన్స్ అన్నట్టుగా ఉన్న వారి పరిస్థితి ట్రంప్ నాయకత్వ బేలాతనంతో తలక్రిందులైంది. ఇప్పుడు అమెరికాకు బహుషా ప్రపంచంలో సగం దేశాలు ఎదురు తిరిగే అవకాశం స్వయంగా ట్రంపే కల్పించుకున్నాడు. ఇది ఒకరకంగా అమెరికన్లకు మింగుడు పడని విషయం. వాస్తవానికి అమెరికా ఇప్పటికి చాలా శక్తివంతమైన దేశం. కానీ, దానికి స్థితప్రజ్ఞత కలిగిన ఒబామాలాంటి నాయకత్వం లేకపోవడమే శాపం, ట్రంప్ వంటి చిత్తచాపల్యం కలిగిన నేతలు అధ్యక్షులుగా ఉండటమే లోపం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు.. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః | స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి || అంటే.. కోపం వల్ల అవివేకం, దానివల్ల మతిమరుపు, దానివల్ల బుద్ధి నాశనం జరుగుతాయి. బుద్ధి నశించినవాడు అథఃపాతాళానికి పడిపోతాడు. అహంకారంతో చేసే యుద్ధం శత్రువుల కంటే ముందే తనను తాను దహించివేస్తుందని స్పష్టంగా చెప్పాడు.. ఇప్పుడు ట్రంప్ వైఖరి అక్షరాల ఆనాటి శ్రీకృష్ణ భగవానుడి మాటల్ని నిజం చేసేలా ఉందనిపించకమానదు. ఒకవైపు పుతిన్ స్థిరంగా, మౌనంగా తన లక్ష్యాల వైపు కదులుతూ విజయంవైపు ప్రయాణిస్తుంటే, చివరికి పాకిస్థాన్ మీద ఆధారపడి యుద్ధాన్ని ఆపించుకునే ప్రయత్నంలో ట్రంప్ ఇరుక్కోవడం నాయకత్వలేమికి నిదర్శనం. నిత్యం అరుపులు పెడబొబ్బలతో అదరగొట్టి లబ్ధి పొందాలని చూసే ట్రంప్ కు గట్టి శత్రువు తాకితే పరిస్థితి ఎలా ఉంటుందో బోధపడింది. ఇక్కడ చెప్పాల్సిందేంటంటే.. ట్రంప్ పిచ్చి వేషాలకు అమెరికా పౌరులు బలికావడం బాధాకరం. అమెరికా ప్రపంచానికి టెక్నాలజీని అందిస్తుంది, ప్రపంచానికి మార్గనిర్దేశనం చేస్తుంది.. నిజానికి అమెరికా బలమైన దేశంగా నిలబడకపోతే ప్రపంచంలో అనేక వినాశనాలు సంభవిస్తాయి. అయితే ట్రంప్ వల్ల ఇప్పుడవన్ని జరుగుతుండటం కలిచివేసే విషయం. ఏదీ ఏమైనప్పటికి కష్టాలు, నష్టాలు, యుద్ధాలు వస్తూనే ఉంటాయి, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో నిజమైన నాయకత్వ లక్షణాలు కలిగిన పుతిన్ ఇవ్వాల ప్రపంచానికి చాటిచెప్పారు. ఇవ్వాల ప్రపంచంలో ప్రతీ నేత పుతిన్ ను చూసి నేర్చుకోవాలి. రేపు రష్యా మరోసారి ప్రపంచంలో సూపర్ పవర్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఏం జరుగుతుందో చూద్దాం.!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రిటైర్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్న టీ-సర్కారు

17 సెప్టెంబర్ - తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగ అంశాలు...

సర్వరోగాలను నయం చేసే బ్రహ్మస్త్రం ఈ దివ్యఔషదం