పోస్ట్‌లు

చిత్రం
స్వాతంత్ర్యామా...నీకు సలాం. అహింసాయుత మార్గంలో పోరాడి దేశానికి స్వేచ్ఛా వాయులను పీల్చుకున్న దేశం భారతదేశం. అయితే కొన్ని అసాంఘిక శక్తులు ఈ స్వేచ్ఛా వాతావరణంలో భయోత్పాతాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముంబాయి, హైదరాబాద్, బెంగుళూరు , అహ్మదాబాదు వరుస పేలుళ్లతో ప్రజలను భయబ్రంతులకు గురిచేస్తున్నారు. దేశంలో ఏక్కడో చోట పేళుల్లు జరుగుతూనే ఉన్నాయి.. అమాయకులు బలైపోతునే ఉన్నారు. పేరుకే స్వేచ్చయుతమైన దేశమైన ఎప్పుడు మనకు గుండే నిండా స్వేచ్చ లేదు. ప్రతి క్షణం , ప్రతి పౌరుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నట్లుంది. స్వేచ్ఛా భారతంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య జరుపుకోవాల్సిన దుస్థితి. దేశం శాంతియుత వాతావరణంతోనూ , ధనధాన్యాలతో , సుఖసంతోషాలతో వర్థిల్లాలనీ ఈ 6 5వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కోరుకుందాం. తెల్లదొరల పాలనకు విముక్తి పలికిన కాలం.. సత్యగ్రహాలతో సత్యం గెలిచిన క్షణం.. వందల యేండ్ల బానిసత్వానికి విముక్తి కలిగిన తరణం. మూడు రంగుల జెండా రెపరెపలాడిన సంధర్భం.. యావత్ దేశం మొత్తం సంబరాల్లో మునిగిన ఆనందలనిలయం.. స...

తెలంగాణ హీరో

చిత్రం
తెలంగాణ హీరో.. కొందరి చావు చరిత్రకు ప్రాణం పోస్తది... త్యాగానికి చిరునామగా నిలుస్తది. స్పూర్తిగా నిలిచి గుండే గుండేను తట్టిలేపి ఉద్యమాలకు ఊపిరిపోస్తది. ఎదురు తిరగడం.. తుపాకీ గొట్టానికి ఎదురేగడం.. రొమ్ములు నిక్కబొడిచి దమ్ముంటే కాల్చరా.. ? అని గర్జించడం వీరులకు మాత్రమే సాధ్యమైతది. అనుభవించాడనికి అన్ని ఉన్న విద్య నేర్పిన విజ్ఙానంతో పేదలకోసం ... సాయుధ పోరాటం చేసి తొలి అమరుడైన అనభేరి ప్రభాకర్ రావు 101 జయంతి నేడు. 15 ఆగస్టు 1910 లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలేపల్లి గ్రామంలో ఓ తిరుగుబాటు జెండా పుట్టింది. అణచివేయబడుతున్న జనం కోసం ఓ ఉద్యమ కెరటం ఉదయించింది. ఆ జెండే అనభేరి ప్రభాకర్ రావు. ప్రభాకర్‌ రావు ఇంటిపేరు అనభేరి.. చేసింది రణభేరి. వెంకటేశ్వర్ రావు దేశ్ ముఖ్ , రాధాబాయిల గారాల బిడ్డ అనభేరీ ప్రభాకర్ రావు. ఈయన భార్య పేరు సరళాదేవి. వీరికి నాలుగురు సంతానం. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన అనభేరి.. మచిలీపట్నం హిందూ హైస్కూల్ లో ప్రాథమిక విద్యను , హైదరాబాద్ చాదర్ ఘాట్‌లో హైస్కూల్‌ విద్యను , నిజాం కాలేజిలో ఇంటర్ పూర్తి చేసి బనారస్ లోని కాశీ విద్యపీఠ్ లో ఉన్నత విద్యనభ్యసించారు. పై చదువు...

రాఖీ పండగ.. ఆత్మీయతకు ప్రతీక.

చిత్రం
రాఖీ పండగ.. ఆత్మీయతకు ప్రతీక. అన్న చెల్లెలు అనుబంధానికి ... అనురాగానికి ... రక్షబంధన్ ప్రతీక. అన్నకు చెల్లెలు రాఖీ కట్టి.. చల్లగా ఉండాలని కోరుకుంటే.. చెల్లెలు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని అన్నయ్య అశీర్వదీస్తాడు. రక్తసంబంధాన్ని రక్షబంధన్ తో గుర్తుచేసుకునే ఆత్మీయ క్షణాలు. అదే మన తెలంగాణల రాఖీల పండుగ.అన్నా చెల్లెళ్ల అనుబంధమై .. అనుభూతుల స్మృతియై.. అనురాగాల వెల్లువై మదిని మీటు సంబరం రాఖీ పౌర్ణమి.. రక్షాబంధన్‌ . పేరేదైనా పెల్లుబికే ఆనందం ఒక్కటే . ప్రేమానుబంధాల పల్లకిలో నీకిదే సుస్వాగతం అంటూ అక్కాచెల్లెళ్లు ఆహ్వానించే రోజు ఇవాళ. . అన్నా చెల్లెళ్ల అనుబంధానికిది ప్రత్యేకమైన పండుగ రోజు. ప్రతి గడపలో ఎదురు చూపు... ప్రతి మనసులో మైమరుపు... చెల్లి వస్తుందన్న ఆనందంతో.. అన్న మనసు పులకరిస్తది. తమ్ముడిని చూస్తానన్నసంతోషంతో అక్క మనసు పరవశిస్తది. తియ్యని పిండివంటలు అన్నకు..తమ్ముడికి పెట్టి చెళ్లెలు..అక్క తమ ఆత్మయతను అందిస్తే.. నిండు నూరేల్లు చల్లగా ఉండాలని అన్నలు అశీర్వాదిస్తాడు.అన్నా అన్న పిలుపులో ఎంత ఆనందముంటుందో.. అక్కా అన్న పలకరింపులో అంతటి అనురాగం ప్రతిధ్వనిస్తది. అనుభవించే కొద...

na shodhana: fathersday

na shodhana: fathersday

కథ

చిత్రం
అందరు బిచ్చగాళ్లే ...... ఓ సామ్రాజ్యంలో చక్రవర్తిగారి ఆస్థానంలోకి ఓ బిచ్చగాడు ప్రవేశిస్తాడు.. రాజుతో ఓ మాట చెప్పాలని విన్నవిస్తాడు.. బిచ్చగాడి వినతిని మన్నించిన మహరాజు..ఎంటని ప్రశ్నిస్తాడు మహారాజు.. ? రాజా.. అందరు బిచ్చగాళ్లే కానీ కొందరు అది గుర్తించడం లేదు అని విన్నవిస్తాడు.. మీరైన గుర్తించాలి అని చెప్తాడు.. ఒక్కడుగు ముందుకేసిన బిచ్చగాడు.. మీరుకూడ బిచ్చగాళ్లే కదా మహారాజా అని సెలవిస్తాడు.. ఏదో ఆపద ఉందని మాట్లడమని అవకాశం ఇస్తే నన్నె బిచ్చగాడని సంభోదిస్తావా.. అంటూ కోపోద్రిక్తుడైన చక్రవర్తి... వీడిని తీసుకెళ్లి చెరసాలలో బంధించండిరా అంటాడు... పక్కనున్న తెనాలి రామకృష్ణుడు ఫక్కున నవ్వుతు నిజం మాట్లాడితే మంచి శిక్ష వేశారు రాజుగారు అంటు పక్కనున్న ఆస్థాన కవితో చెమక్కులు విసురుతాడు.. ఆ మాట వెళ్లి చక్రవర్తిగారి చెవిని చేరుతుంది. రామకృష్ణులుగారు ఇందాక మా గురించి ఏదో అన్నరట కాదా అని ప్రశ్నిస్తాడు రామకృష్ణున్ని... చక్రవర్తిగారు.. మీ గురించి నేను మాట్లడ్డమా.. అది తప్పుగా మాట్లడ్డమా.. మీ సోమ్ములు తింటు.. మీ నీడన బతుకుతు.. మీ ఆస్థాన కవిగా గౌరవం పొందుతూ మీమ్మల్ని ఎదురించి మాట్లడ్డమా.....