పోస్ట్‌లు

మిస్టర్ ఛీప్ మినిస్టర్...!

చిత్రం
మిస్టర్ ఛీప్ మినిస్టర్...! ఒక ప్రశ్న ఉదయించింది ఒక పిడకిలి పైకెగిసింది. ఒక నినాదాం గర్జిస్తుంది. కేసులు పెట్టుకోండి అంటూ... తెగువ సవాళ్లు విసురుతుంది. సర్కారు వల్లవుతుందా.. ? దిక్కరించిన గొంతులను జైల్లో పెట్టడానికి.. నియంతవల్లవుతుందా.. ? నింగికెగసిన చైతన్యాన్ని బంధించడానికి.. మోనార్కుల వల్లవుతుందా ? మోసాలను కప్పిపుచ్చడానికి నెవర్.. నిప్పులు కక్కె సూర్యున్ని పట్టుకోవడం ఉస్పెనలా ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమాన్ని  ఆపడం.. రెండోక్కటే. ఆనాటి పగిడిద్దరాజు త్యాగం.. నేడు శ్రీకాంత చారి వీర మరణం.. చరిత్ర నుంచి చెరిపెయ్యగలరా.. ? జైల్లో బంధీచేయ్యలరా.. ? ఆకాంక్షల గొంతుకను ఆత్మగౌరవ వీచికలను సొప్ప బెండ్ల లాంటీ నీ సైన్యం.. పూచిక పుల్లలాంటి నీ సేనలు ఆపగలవా.. ? బంధూకులను దనుమాడిన బందగీ వారసత్వం గుత్పలు పట్టి తరిమిన సాకలి ఐలమ్మ సహసం ఒడిషెలు పట్టి తరిమిన దొడ్డికొమురన్న పౌరుషం విల్లంబులు ఎక్కుపెట్టిన కోమురం భీం రౌద్రం వారసత్వమై రక్తం చుక్కచుక్క నిండిఉంటే నీ కుట్రలు.. నీ కుతంత్రాలు.. నీ ఎత్తులు నీ ఎస్మాలు.. నీ 177 జీవోలు నీ అమ్మడాలు కొనడాలు.. అపగలవా మిస్టర్ ఛీఫ్ మినష్టర...
చిత్రం
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందా?      కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందంటూ టీడీపీ, సీమాంధ్ర నాయకులు విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌కు చెందిన నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. ఉద్యమాన్ని దెబ్బకొ ఈ కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందా? లేక పొత్తు పెట్టుకుంటామా? అన్నది రాష్ట్రం వచ్చిన తర్వాతి సంగతని చెప్పారు. ఇప్పుడు ఆ చర్చలు అనవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మరో సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకే తమ పార్టీ అధిష్ఠానం సంప్రతింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నదని ఆయన చెప్పారు. ప్రధానంగా సీమాంవూధుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు అన్ని పక్షాలతో సంప్రతింపుల ప్రక్రియను ముగించడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. ఉద్రిక్తతల నడుమ పరిపూర్ణ నిర్ణయం సాధ్యం కాదు కనుక తెలంగాణ ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని ఆయన విశ్లేషించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందంటూ టీడీపీ, సీమాంధ్ర నాయకులు తప్పుడు ప్రచారానికి దిగడం దారుణమని అన్నారు. ఉద్యమాన్ని ...
చిత్రం
                      ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ...   రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కోర్‌కమిటీ నిర్ణయాలు తెలుపాలని ఆజాద్‌ను టీ నేతలు కోరారు. త్వరలోనే అన్ని వివరాలు తెలుపుతామని ఆజాద్ కాంగ్రెస్‌నేతలకు హామీ ఇచ్చారు. తెలంగాణ అంశంపై ఏదో ఒకటి తేలేంతవరకు ఢిల్లీని వదిలి పొయ్యేదిలేదని ఆజాద్‌కు టీ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

TELANGANA...

చిత్రం
                మంత్రి పదవికి కోమటిరెడ్డి రాజీనామా... రాష్ర్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేసినట్...

నా నేల....

చిత్రం
నా నేల.. గుండెలు తడి ఆరీ తల్లడిల్లుతున్నయి. మట్టి వాసన కోసం.. మమకారం కోసం.. పల్లే పంచిన అనుభూతుల కోసం... పల్లే ఇచ్చిన అప్యాయత కోసం.. పట్నం మోజులో పడి మరిచిన అనూరాగం కోసం.. పడి పడి పరుగులు పెడుతున్నయి. కాంక్రీట్ కీకారాణ్యంలో.. కరుణ లేని.. మనుషుల నడుమ.. ప్రేమ లేని అనాగరికుల కడన.. ఉండనంటూ హృదయం.. ఉరుకులు మొదలు పెట్టింది. రంగు రంగుల లైట్ల నడుమ.. రంగు నీళ్ల పొంగుల తోటి.. తళుకు బెళుకు తారల తోడ.. ప్లాస్టిక్ నవ్వుల మధ్య.. కల్లిబొల్లి మాటల చెరన.. నేనుండనంటూ ఒకటే గొడవ.. ఒకటే రభస.. పల్లేకు పోయి... మన గల్లీకి పోయి.. ఆత్మీయత నడుమ.. కడుపు నిండా నవ్వుకొని.. కంటి నిండా నిద్రపోయి.. బతికినన్ని రోజులు తృప్తిగా బతుకుదమని ఒకటే లొల్లి .. ఎం చెప్పను.. ? నాకు గుర్తుకొస్తున్నాయి.. నా మునివేళ్ల నుంచి జారి గిర్రున తిరగిన బొంగరం.. మా ఇంటి పెరటి చెట్టపైన కోతి కొమ్మచ్చి ఆడిన జ్ఙాపకం.. మా పక్కింటి శీనుగాడితో మామిడి పిక్కలాట ఆడిన సంబరం.. కుంటుడు బిచ్చలు.. దొంగ పోలీసు.. అబ్బడ దిబ్బడ.. బద్ది..బాల్ చిర్రగోనే.. చిక్కుడు పుల్లా.. ఎం చ...

డమ్మి యూత్...

చిత్రం
డమ్మి యూత్... బ్లాక్ లో టికెట్స్ కొని సినిమా చూస్తరు... జెండావందనం రోజున ఎంటర్ టైన్ మెంట్ కు జై కొడతరు... ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అప్పుడే ఇండియా జీతేగా అంటరు.. కాలేజికి బంక్ లు కొట్టి అటెండెన్స్ ఫీజులు కట్టి పరీక్షలకు హాజరవుతారు... ఒకే బండిమీద ముగ్గురు నలుగురు కలిసి రయ్యిమని దూసుకుపోతరు. బస్ పాస్ నుంచి బోనోఫైడ్ వరకు అన్నీ కాసులు కొట్టి కాకపట్టి తీసుకుంటరు. రూల్స్ అన్ని ఫాల్స్ చేసే వీళ్లె ఇప్పుడు అన్న హజారే దీక్ష కు మద్దతు అంటున్నరు.. రోడ్డెక్కి అవినీతిపై పోరంటూ జాతీయ జెండా పట్టి ఫోజులు కొడుతున్నరు. అవినీతిపై అన్నా హజారే పోరాటం మొదలపెట్టిన దగ్గరనుంచి నేటివరకు అన్నా పోరుకు మద్దతు పలికి హంగామా చేసింది యూత్ . అన్నాను అరెస్ట్ చేసిన నాటినుంచి ఏ రోడ్డు చూసిన జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తున్న యూతే కనిపించారు. తలపై అన్నా అని హేర్ కటింగ్ చేయడం.. టీ షర్ట్ లపైన అన్నాకు మద్దతుగా కొటెషన్స్ నింపుకున్నరు. అన్నా మాస్కులు ధరించిన్రు. ఇక అమ్మాయిల హంగులు ఆర్భాటాలు అన్ని ఇన్నీ కావు... వొళ్ళంత కనిపించేలా వ...