పోస్ట్‌లు

జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇంత నిర్లక్ష్యమా..? : కే సి ర్

చిత్రం
జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇంత నిర్లక్ష్యమా..? : కే సి ర్          జూనియర్ డాక్టర్ల సమస్యలపై సర్కారుకు చిత్త శుద్ధి లేదని టీ అర్ ఎస్ అదినేత కే సి అర్ నిప్పులు చేరిగిన్రు. పేదల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న  జూనియర్ డాక్టర్లను వేదించడం తగదని హితువు పలికారు. మాట మాటకు ఎస్మా అంటున్న ముఖ్యమంత్రి తన పేరును కిరణ్ కుమార్ రెడ్డి తిసేసుకొని ఎస్మా రెడ్డి అని పెట్టుకోవాలని ఎద్దేవా చేసారు. ఎం పాపం చేసారని జూనియర్ డాక్టర్ల మీద ఎస్మా పెడతారని నిలదీశారు? సర్కారు పిచ్చి పనులు మనకుంటే   టీ అర్ ఎస్ పెద్దఎత్తున ఉద్యమం చేసి సర్కారు మెడలు వంచుతదని హెచ్చరించారు. 
చిత్రం
భక్తజనంతో పులకించిపోతున్న మేడారం !        మేడారం జాతర దుమ్ము రేపుతుంది లక్షల మంది జనంతో కిటకిటలాడుతుంది. అమ్మలు గద్దెలకు రాకముందే భక్తజనంతో పోటెత్తడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇక జాతరలో మరోవిశేషమైన ఏర్పాటు హెలీప్యాడ్. ఆదివాసీల సంస్కృతీ సాంప్రదాయలకు వేదికైన మేడారం జాతర ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. హెలీకాప్టర్ ప్రయాణాలు, సీసీ కెమెరాల నిఘా, వాకీటాకీల మాటలు, కంప్యూటర్ జాతకాలు, బ్యాట్రీ ఆఫ్ టాప్స్ స్నానాలు, సెల్ ఫోన్ల హంగామా జాతరంతా కనిపించనుంది. కోయగిరిజన ఆచారం దెబ్బతినకుండానే లెటెస్ట్ టెక్నాలజీ వాడటం మేడారం జాతర స్పెషల్. దాదాపు మూడు జాతర క్రితం వరకు ఆధునిక సాంకేతిక పరిజ్జానం మేడారం జాతరలో పెద్దగా లేదు. ప్రస్తుతం సంప్రదాయ పద్దతిలోనే వచ్చి పూజలు నిర్వహించుకుని వెల్లేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. సమ్మక్క, సారలమ్మను గద్దెల వద్దకు తీసుకుని రావటం, వనప్రవేశం చేయించటం లాంటి ఆచార, వ్యవహారాలకు సంబందించిన పనుల్లో తప్ప మిగతా కార్యక్రమాలన్నింట్లోనూ కోత్తదనం ఉట్టిపడుతోంది. గతంలో మేడారం జాతరకు వివిధ ప్రాంతాలన...

ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో..

చిత్రం
ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో..  (ఉంటే వీళ్లకు వైద్యం అందాలి కదా)     అంతరిక్షానికి అప్ అండ్ డౌన్ చేస్తున్న ఈ రోజుల్లోనూ మూడనమ్మకాలు రాజ్యమేలుతున్నయి. కడుపు నొప్పి వస్తే.. చెంబు వైద్యంపై ఆధారపడి జీవితాలను ఆగం చేసుకుంటున్నరు ఏజెన్సీ ఆదివాసులు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడనమ్మకాలను నిర్ములిస్తున్నమంటున్న ఐటీడీఏ అధికారుల మాటలు.. పచ్చి అబద్దాలని నిరూపిస్తున్నది ఖమ్మం జిల్లా ఏజెన్సీ. ఇంజక్షన్లు.. గ్లూకోజులు.. ఆపరేషన్లు.. ఎక్సరేలు.. స్కానింగ్ లు.. ఎంజీయోగ్రామ్ లు ఒక్కటేమిటి ఎన్నో అధునిక పరికరాలు.. అయినా రోగం తగ్గుతుందన్న గ్యారంటీ లేని రోజులివి. అట్లాంటిది ఓ చెంబు వైద్యంతో కడుపు నొప్పి తగ్గుతుందని నమ్ముతున్నరు అమాయక ఆదివాసులు. అలా నమ్మే ఒక్కొసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నరు. ఖమ్మం జిల్లాలోని భద్రచలం ఏజెన్సీలోని చింతూరు మండలం సరివెల గ్రామంలో కడుపు నొప్పికి  ఈ చెంబు వైద్యం ఫేమస్. గూడెంలో ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిందంటే చాలు వెంటనే గ్రామంలో ఉన్న చెంబు డాక్టర్ దగ్గరికి పరుగులు పెడతరు. ఇక చెంబు వైద్యునితో చికిత్స తీసుకుంటరు. కడుపునొప్పి వచ్చిన రొగి...

ఎంత దారుణం...

చిత్రం
ఎంత దారుణం... అమ్మ ఒడిలో ఒదిగిపోవాల్సిన పసిపాపలు.. చెత్త కుప్పల్లో ప్రత్యక్షమవుతున్నారు. తల్లి ముద్దు.. మురిపాలతో తడిసిపోవాల్సిన బంగారుకొండలను.. కుక్కలు పీక్కుతింటున్నయి. కన్నవాళ్ల రాక్షసత్వానికి నిన్న ఒక్కరోజే ఇద్దరు పసివాళ్లు ప్రాణాలు విడిచిన్రు. మురికి గుంటల్లో పందులకు, కుక్కలకు ఆహారమైన్రు. గుండెలను కలిచివేసిన పాలబుగ్గల పసిపాపల మరణాలపై  సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న విజయవాడలో ఓ పసిగుడ్డు మరణం..నిన్న ఢిల్లీ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పలక్ అనే పసిపాప ఘటన. ఈ రెండు మరవకముందే మరో రెండు ఘటనలు. అది రాజధాని నడిబొడ్డలో అయితే.. మరోటి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. p ఈ పసిపాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ ఎల్బీనగర్ లోని చెరువు గట్టుపైన వదిలివెల్లిన్రు. గుక్కపట్టి ఏడ్చీన పాప చివరికి ఊపిరి విడించింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పసిపాపను చూసి విషయం స్థానికులకు చెరవేసిండు. దీంతో తండోపతండాలుగా వచ్చిన జనం.. హృదయవిదారకమైన సీన్ను చూసి కంటతడిపెట్టిన్రు. పసిపాపను వదిలివెళ్లిన మృగాలకు శాపనార్థాలు పెట్టిన్రు. p ఇక అదిలాబాద్ జిల్లా...

ఇదీ జీవితం..

చిత్రం
ఇదీ జీవితం..  పాలకుల నిర్లక్ష్యంతో పల్లెల్లో ఉపాధి కరువైంది. దాని ప్రభావం   బతుకుపై   పడింది. ఫలితంగా దుబాయి , సౌదీ , గల్ఫ్ ఫ్లైట్ ఎక్కక   తప్పని   పరిస్థితి . దళారులను నమ్మి బతుకు బాట పట్టినా.. అక్కడ ఉపాధిదొరుకుతుందన్న   గ్యారంటీ లేదు. ప్రాణాలతో తిరిగి వస్తమన్న   నమ్మకం లేదు. అలా ఎంతో   మంది జీవితాలు దళారుల దళాలి మాటలకు   బలైపోయినయి. అందుకే   కరీంనగర్ బస్టాండ్ నుంచి మొదలైన కన్నీటి ధార … సౌదీ ఎయిర్ పోర్ట్ లో   దిగేంత వరకు ఆగదు. అంతేనా.. అమ్మ వండిపెట్టిన   బువ్వ యాది.. బస్టాండ్ల తాను ఏడస్తూ కొంగుతో కొడుకు కన్నీళ్లు తూడుస్తున్న అమ్మమనాది.. గుండెలో బడిగంగ కొట్టినట్టు మొగుతుంటయి. పొద్దున ఐదుగొట్టంగనే లేచినవురా రాజుగా.. అని నాయిన పిలిచినట్టు పిలుపులు వినిపిస్తయి. దోస్త్ శినుగాడు మంచంలో పక్కన పడుకొని  సినిమాల గురించి మాట్లడుకున్న మాటలు  చెవుల నిండా వినిపిస్తుంటాయి. కొడవలి , సద్దిమూట పట్టుకొని  కైకిలు పోతున్నప్పుడు మోగే చెల్లె కాలి గజ్జెల సౌండ్లు గల్లుమని మోగినట్టనిపిస్తుంటయి. అన్న కొడుకు , అక్క కొడుకొ బాబాయ...

అంబెద్కర్.. నిత్యచైతన్యం!

చిత్రం
అంబెద్కర్.. నిత్యచైతన్యం ! గుణపాలు కూల్చలేవు చైతన్యాన్ని కుట్రలు కదిలించలేవు.. త్యాగాల పునాదులను కుతంత్రాలు పెకలించలేవు.. దళిత బహుజనుల ప్రతిరూపాన్ని చీకట్లు కమ్ముకోలేవు వెలుగుల ప్రస్థానాన్ని అదిరింపులు ఆపలేవు.. అకాశమంత ఆత్మభిమానాన్ని బెదిరింపులు నిలువరించలేవు.. తెగించి కొట్లాడిన వీరుణ్ణి పిడికిళ్లు బిగించిన చేతులవి.. అగ్రవర్ణల ఎత్తులపై పిడిగుద్దులు గుద్దిన ధైర్యమది.. ఒక్క విగ్రహం కూల్చితే.. చరిత్ర నుంచి చెరిగిపోవునా.. ? ఒక్క చేయి విరగ్గొడితే.. అనంతమంత కీర్తి చెదిరిపోవునా.. ? అసంతృప్తి కుక్కలు..  కలుపు మొక్కలు.. సమాజానికి అక్కరలేని చిల్లర వ్యక్తులు.. చేసే పిచ్చి పనులు.. అంబెద్కర్ కీర్తికి ఇసుమంతైనా భంగం కాదు.. అదీ  అంబోతుల వెకిలి చేష్టలకు గురుతులు..

ప్రభుత్వాలు మానవత్వం మరిస్తే..

చిత్రం
ప్రభుత్వాలు మానవత్వం మరిస్తే..     (ప్రజలుతమనుతాముచంపుకోల్సిందే) పుట్టిన ప్రతి మనిషి నిండు నూరేళ్ళు బతికుండాలని కోరుకుంటాడు. కానీ కరీంనగర్ జిల్లాలో కట్ల శ్రీనివాస్ మాత్రం తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. చికిత్సలేని రోగంతో గత 22 సంవత్సరాలుగా అనుభవిస్తున్న నరకయాతన నుంచి తనకు విముక్తి ప్రసాదించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. కండరాల క్షీణతతో జీవచ్చవంలా మారి.. సర్కారు సహాయం లేక   MERCY KILLING కోరుతున్నడు    కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన శ్రీనివాస్ 1988లో డిగ్రీ చదువుతున్నప్పుడు కండరాల క్షీణత (మస్క్యూలర్ డిస్ట్రోఫి) వ్యాధి సోకింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఫలితం లేదు. లక్షలు ఖర్చు చేసిన రోగం నయం కాలేదు. దీంతో అతను గత 22 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై జీవచ్చవంలా బతుకుతున్నాడు. చేతుల్లో కొద్దిగా చలనం ఉన్న.. కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఎవరి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్న శ్రీనివాస్ కు తల్లిదండ్రులే సేవలు చేస్తున్నారు. చికిత్సలేని రోగంతో బాధపడుతున్న తాను చావడానికి సిద్దంగా ఉన్నానని.. ప్రభుత్వం కారుణ్...