పోస్ట్‌లు

ప్రభుత్వాలు మానవత్వం మరిస్తే..

చిత్రం
ప్రభుత్వాలు మానవత్వం మరిస్తే..     (ప్రజలుతమనుతాముచంపుకోల్సిందే) పుట్టిన ప్రతి మనిషి నిండు నూరేళ్ళు బతికుండాలని కోరుకుంటాడు. కానీ కరీంనగర్ జిల్లాలో కట్ల శ్రీనివాస్ మాత్రం తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. చికిత్సలేని రోగంతో గత 22 సంవత్సరాలుగా అనుభవిస్తున్న నరకయాతన నుంచి తనకు విముక్తి ప్రసాదించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. కండరాల క్షీణతతో జీవచ్చవంలా మారి.. సర్కారు సహాయం లేక   MERCY KILLING కోరుతున్నడు    కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన శ్రీనివాస్ 1988లో డిగ్రీ చదువుతున్నప్పుడు కండరాల క్షీణత (మస్క్యూలర్ డిస్ట్రోఫి) వ్యాధి సోకింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఫలితం లేదు. లక్షలు ఖర్చు చేసిన రోగం నయం కాలేదు. దీంతో అతను గత 22 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై జీవచ్చవంలా బతుకుతున్నాడు. చేతుల్లో కొద్దిగా చలనం ఉన్న.. కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఎవరి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్న శ్రీనివాస్ కు తల్లిదండ్రులే సేవలు చేస్తున్నారు. చికిత్సలేని రోగంతో బాధపడుతున్న తాను చావడానికి సిద్దంగా ఉన్నానని.. ప్రభుత్వం కారుణ్...

నేతాజీ సుభాష్ చంద్రబోస్

చిత్రం
నేతాజీని స్మరించేది ఇలాగేనా.. ? నేతాజీ సుభాష్ చంద్రబోస్  ( జననం : జనవరి 23 , 1897 .మరణం తెలియదు) వీరుడికి మరణం లేదు అన్న మాట నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి  అచ్చుగుద్దినట్టు సరిపోతుంది . ఉహ తెలిసినప్పటినుంచి నీతి నిజాయితితో  దేశం కోసం పోరాడిన అతి కొద్దిమంది ఉద్యమకారుల్లో సుభాష్ చంద్రబోస్  ప్రముకులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గాంధీజీ కన్నా మిన్న నేతాజీ. ఈ  దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారంటే.. మనం అనుకుంటున్నట్టు   అహింస ఒక్కటే కాదు.. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్  కూడా కారణం. అంతే  కాదు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ బండుప్ర్రేతికి బాటాలేస్తే..నిస్వార్దంగా  పోరాడిన గొప్ప ఉద్యమకారుడు నేతాజీ. నేతాజీ గురించి చెబుతున్నానంటే  గాంధీజిని తక్కువ చేయడం కాదు.. నేతాజీ ఔన్నత్యాన్ని గుర్తించడమే అన్న  సంగతి విస్మరించకూడదు. ఇక బ్రిటిష్ వాళ్ళు నేతజిని ఇస్తామని హామీ  ఇస్తేనే స్వతంత్రం ఇస్తామని చెప్పారంటే నేతాజీ వాళ్ళ గుండెల్లో ఎలా  నిద్రపోయరో అర్ధం చేసుకోవలసిందే.

ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి

చిత్రం
ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి . అదిలాబాద్ అడవుల్లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుల్లు.. సాంప్రదాయ నృత్యాలతో ఆదివాసీలు నాగోబా జాతరకు తరలివస్తున్నరు. జాతర మొదలైన కొద్ది గంటల్లోనే వేలాది మంది భక్తులు పోటెత్తారు. గంగా జలాలతో మెస్రం వంశీయులు నాగోబాను అభిషేకించి జాతరను షురూ చేసిన్రు. చిమ్మచీకట్లో నాగోబా ఆలయ ప్రవేశం చేశాడు. వేలాది మంది ఆదివాసీల కొలుపులతో నాగోబా జాతర జోరుగా మొదలైంది. పుష్యమాస అమావాస్య ప్రారంభమైన తొలిగడియల్లోనే మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించిన్రు. కాలినడకన పవిత్ర గంగా జలాలతో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన్రు. ఈ పూజతో నాగోబా జాతర మొదలైంది. నాగోబా .. గోండుల అతిపెద్ద జాతర కావడంతో మన రాష్ట్రం నుంచే కాక , మధ్యప్రదేశ్ , మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు . తమ ఇలవేల్పు  నాగోబాను దర్శించుకొని భక్తులు పులకించిపోతున్నరు. ఎడ్లబండ్లు.. కాలినడకన భక్తులు ఆలయానికి వస్తున్నారు. నాగోబా దైవనామస్మరణతో ఆలయపరిసరాలను హోరెత్తిస్తున్నరు. జాతరను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో అలంకరించిన్రు. కొత్త కుండల్లో తీ...

కడుపుకొడితే ఎవ్వడైనా ఒక్కటే..(తన్ని తరిమేయాల్సిందే)

చిత్రం
కడుపుకొడితే ఎవ్వడైనా ఒక్కటే..(తన్ని   తరిమేయాల్సిందే) ఆదివాసీలు కదం తొక్కారు. ఖమ్మం జిల్లాను నినాదాలతో హోరెత్తించారు.  కొండకోనల నుంచి పట్టణంలో అడుగుపెట్టి హల్చల్ చేశారు. ఆత్మగౌరవ కోసం బాణాలు ఎక్కుపెట్టారు. వేటగాళ్ల దెబ్బ ఎట్లుంటదో ఖమ్మం జిల్లా దారులపై ప్రదర్శించిన్రు. అందరిని ఎస్టీల్లో కలిపి ఆదివాసులను ఆగం చేస్తే దుమ్ముదులుపుతమని తేల్చిచెప్పారు. యస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసీల తడాఖ చూపెడతమని హెచ్చరించారు. ఆదివాసీల ఆత్మగౌరవం పేరుతో భారీ బహిరంగ సభను  ఖమ్మం పట్టణంలో నిర్వహించారు. మా రాజ్యం మాకే కావాలంటు సర్కారుకు జలక్ ఇచ్చిన్రు. ఆదివాసీ ఆత్మగౌరవసభకు జిల్లా నలుమూలలనుంచి వేలాదిగా ఆదివాసీలు కదంతొక్కినరు.సాంప్రదాయ కొమ్ము నృత్యాలతో, బాణాలతో కనువిందు చేస్తూ సర్ధార్ పటేల్ స్టేడియం నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినరు. ఆదివాసీల వాదన. ·          1950 నుంచి 1966 వరకు లంబాడాలు ఆంధ్రప్రదేశ్ లో ఓసి జాబితాలో ఉన్నరు. ·       ...

పాపం జూ.డా లు

చిత్రం
డాక్టర్ల పరిస్థితి ఇలా ఉంటే రోగులకు సేవలెలా.. ?      నిత్యం పేదల సేవలో మునిగిపో యే   వరంగల్ జూనియర్ డాక్టర్లు.. సర్కారు నిర్లక్ష్యం పుణ్యానా.. ఇలా రోడ్డెక్కి నిరసన తెలుపాల్సిన దుస్థితి దాపురించింది. లక్షల కోట్ల ప్రాజెక్టులు కట్టేందుకు లాగాయించి పరుగులు పట్టే సర్కారు పెద్దలు.. చదువుకుంటాం ఇన్ని స్కాలర్ షిప్ లు, ఫెల్లోషిప్ లు ఇవ్వమంటే నిర్లక్ష్యం చేయడంతో హాస్పటల్ లో రోగులకు సేవలు చేయాల్సిన డాక్టర్లు..రోడ్డుమీద ఉద్యమం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నల్లడ్రస్సులు ధరించి నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మొండివైకరికి నిరసనగా నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు.  కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఎంజిఎం వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఎయిమ్స్ తరహాలో తమకూ స్టయిఫండ్ చెల్లించాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా అన్ని వసతులు కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. శిక్షణా కాలాన్ని కూడా సర్వీసులో భాగంగా పరిగణించ...
చిత్రం
ఇదీ ఆసుపత్రే.. నమ్మాలి అంతే. ఇది నల్లగొండ జిల్లా కేంద్రంలోని  కేంద్ర ప్రభుత్వ  ఆసుపత్రి   జిల్లా నలుముల ఉన్న పేద ప్రజలకు   కొంతలో కొంత మెరుగైన వైద్యం  అందించే ఏకైక ఆసుపత్రి..   పోయిన  సంవత్సరంలో మే నెలలో ఈ  ఆసుపత్రి స్దాయిని  250 పడకలనుంచి  400  పడకలకు పెంచుతున్నట్లు  స్వయాన ప్రభుత్వమే  నిర్ణయం తీసుకుంటూ  జీఓ లను   విడుదల చేసింది..  ప్రభుత్వం  జీఓ విడుదల చేసి  ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా  నిధులు విడుదల కాలేదు.. ఒక్క  అదనపు సిబ్బందిని గానీ , డాక్టర్లను , వసతులను కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో   ఆసుపత్రికి  వచ్చే రోగులకు సరైన వైద్యం అందక  సౌకర్యాలు నేలపైనే పడుకుంటున్నరు. మాములు వాళ్ల సంగతి అలా ఉంచితే  ప్రసవం కోసం వచ్చే మహిళలు పడకలు లేక నేలపైనే పడుకుంటూ పడరాని పాట్లు పడుతున్నరు. పేరు గోప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పేరుకేమో  పెద్దఆసుపత్రి వసతులేమో చిన్నసుపత్రి అన్నట్లు తయారైందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు...

చూసుకుందాం రండి...

చిత్రం
చూసుకుందాం రండి... టైగర్ ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు.  ప్రాజెక్టు వ్యతరేఖ నినాదాలతో ఆదిలాబాద్ కలెక్టరేట్  ను హోరెత్తించారు. బలవంతంగా మా మా భూమి నుంచి.. మా ఆత్మనుంచి మమ్మల్ని వేరు చేస్తే జోడేఘాట్ తరహాలో తిరగబడతమని గర్జించారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో కవ్వాల్ అడవినుంచి తమను పంపించి అనాథాలను చేయాలని చూస్తే కొమరంభీం వారసత్వ సత్తాను చూపుతామని హెచ్చరించారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం , బతుకుతున్న నేల కోసం ఎంతకైనా తెగిస్తామని... ఉన్న ఊరు - కన్నతల్లితో ఉన్న  అనుభంధాన్ని తెంచాలని చూస్తే యుద్ధమే అవుతుందని ఆదివాసులు తేల్చిచెప్పారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో అభయారణ్యంలో 41 ఊర్లను ఖాళీ చేయాలని సర్కారు చేస్తున్న దుష్ట ప్రయత్నాలను తిప్పికొడతామని.. తమ బతుకులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోమని నిప్పులు చెరిగారు.  పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారని వారి వ్యవహార శైలి రౌడీలను తలపిస్తున్నదని గిరిజన నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రాజెక్టు కోసం తమ  గూడెంలో  విష సర్పాలు వదులుతున్నారని, పులులను వదిలి భయపెట్టిస్తున...

మీకు కళ్లున్నాయా.. మంత్రిగారు.

చిత్రం
మీకు కళ్లున్నాయా.. మంత్రిగారు.                                                        విరిగి పోయిన టేబుళ్లు....                                                     మాసిపోయిన బోర్డులు...                                                   రెక్కలు విరిగిన ఫ్యాన్లు.. కూలిపోయిన గోడలు..పాడువడ్డ పరిసరాలు..  విరిగిన కిటికీలు.. పలిగిన తలుపులు.. లేచిపోయిన రేకులు..రెక...