పోస్ట్‌లు

ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి

చిత్రం
ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి . అదిలాబాద్ అడవుల్లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుల్లు.. సాంప్రదాయ నృత్యాలతో ఆదివాసీలు నాగోబా జాతరకు తరలివస్తున్నరు. జాతర మొదలైన కొద్ది గంటల్లోనే వేలాది మంది భక్తులు పోటెత్తారు. గంగా జలాలతో మెస్రం వంశీయులు నాగోబాను అభిషేకించి జాతరను షురూ చేసిన్రు. చిమ్మచీకట్లో నాగోబా ఆలయ ప్రవేశం చేశాడు. వేలాది మంది ఆదివాసీల కొలుపులతో నాగోబా జాతర జోరుగా మొదలైంది. పుష్యమాస అమావాస్య ప్రారంభమైన తొలిగడియల్లోనే మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించిన్రు. కాలినడకన పవిత్ర గంగా జలాలతో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన్రు. ఈ పూజతో నాగోబా జాతర మొదలైంది. నాగోబా .. గోండుల అతిపెద్ద జాతర కావడంతో మన రాష్ట్రం నుంచే కాక , మధ్యప్రదేశ్ , మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు . తమ ఇలవేల్పు  నాగోబాను దర్శించుకొని భక్తులు పులకించిపోతున్నరు. ఎడ్లబండ్లు.. కాలినడకన భక్తులు ఆలయానికి వస్తున్నారు. నాగోబా దైవనామస్మరణతో ఆలయపరిసరాలను హోరెత్తిస్తున్నరు. జాతరను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో అలంకరించిన్రు. కొత్త కుండల్లో తీ...

కడుపుకొడితే ఎవ్వడైనా ఒక్కటే..(తన్ని తరిమేయాల్సిందే)

చిత్రం
కడుపుకొడితే ఎవ్వడైనా ఒక్కటే..(తన్ని   తరిమేయాల్సిందే) ఆదివాసీలు కదం తొక్కారు. ఖమ్మం జిల్లాను నినాదాలతో హోరెత్తించారు.  కొండకోనల నుంచి పట్టణంలో అడుగుపెట్టి హల్చల్ చేశారు. ఆత్మగౌరవ కోసం బాణాలు ఎక్కుపెట్టారు. వేటగాళ్ల దెబ్బ ఎట్లుంటదో ఖమ్మం జిల్లా దారులపై ప్రదర్శించిన్రు. అందరిని ఎస్టీల్లో కలిపి ఆదివాసులను ఆగం చేస్తే దుమ్ముదులుపుతమని తేల్చిచెప్పారు. యస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసీల తడాఖ చూపెడతమని హెచ్చరించారు. ఆదివాసీల ఆత్మగౌరవం పేరుతో భారీ బహిరంగ సభను  ఖమ్మం పట్టణంలో నిర్వహించారు. మా రాజ్యం మాకే కావాలంటు సర్కారుకు జలక్ ఇచ్చిన్రు. ఆదివాసీ ఆత్మగౌరవసభకు జిల్లా నలుమూలలనుంచి వేలాదిగా ఆదివాసీలు కదంతొక్కినరు.సాంప్రదాయ కొమ్ము నృత్యాలతో, బాణాలతో కనువిందు చేస్తూ సర్ధార్ పటేల్ స్టేడియం నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినరు. ఆదివాసీల వాదన. ·          1950 నుంచి 1966 వరకు లంబాడాలు ఆంధ్రప్రదేశ్ లో ఓసి జాబితాలో ఉన్నరు. ·       ...

పాపం జూ.డా లు

చిత్రం
డాక్టర్ల పరిస్థితి ఇలా ఉంటే రోగులకు సేవలెలా.. ?      నిత్యం పేదల సేవలో మునిగిపో యే   వరంగల్ జూనియర్ డాక్టర్లు.. సర్కారు నిర్లక్ష్యం పుణ్యానా.. ఇలా రోడ్డెక్కి నిరసన తెలుపాల్సిన దుస్థితి దాపురించింది. లక్షల కోట్ల ప్రాజెక్టులు కట్టేందుకు లాగాయించి పరుగులు పట్టే సర్కారు పెద్దలు.. చదువుకుంటాం ఇన్ని స్కాలర్ షిప్ లు, ఫెల్లోషిప్ లు ఇవ్వమంటే నిర్లక్ష్యం చేయడంతో హాస్పటల్ లో రోగులకు సేవలు చేయాల్సిన డాక్టర్లు..రోడ్డుమీద ఉద్యమం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నల్లడ్రస్సులు ధరించి నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మొండివైకరికి నిరసనగా నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు.  కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఎంజిఎం వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఎయిమ్స్ తరహాలో తమకూ స్టయిఫండ్ చెల్లించాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా అన్ని వసతులు కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. శిక్షణా కాలాన్ని కూడా సర్వీసులో భాగంగా పరిగణించ...
చిత్రం
ఇదీ ఆసుపత్రే.. నమ్మాలి అంతే. ఇది నల్లగొండ జిల్లా కేంద్రంలోని  కేంద్ర ప్రభుత్వ  ఆసుపత్రి   జిల్లా నలుముల ఉన్న పేద ప్రజలకు   కొంతలో కొంత మెరుగైన వైద్యం  అందించే ఏకైక ఆసుపత్రి..   పోయిన  సంవత్సరంలో మే నెలలో ఈ  ఆసుపత్రి స్దాయిని  250 పడకలనుంచి  400  పడకలకు పెంచుతున్నట్లు  స్వయాన ప్రభుత్వమే  నిర్ణయం తీసుకుంటూ  జీఓ లను   విడుదల చేసింది..  ప్రభుత్వం  జీఓ విడుదల చేసి  ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా  నిధులు విడుదల కాలేదు.. ఒక్క  అదనపు సిబ్బందిని గానీ , డాక్టర్లను , వసతులను కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో   ఆసుపత్రికి  వచ్చే రోగులకు సరైన వైద్యం అందక  సౌకర్యాలు నేలపైనే పడుకుంటున్నరు. మాములు వాళ్ల సంగతి అలా ఉంచితే  ప్రసవం కోసం వచ్చే మహిళలు పడకలు లేక నేలపైనే పడుకుంటూ పడరాని పాట్లు పడుతున్నరు. పేరు గోప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పేరుకేమో  పెద్దఆసుపత్రి వసతులేమో చిన్నసుపత్రి అన్నట్లు తయారైందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు...

చూసుకుందాం రండి...

చిత్రం
చూసుకుందాం రండి... టైగర్ ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు.  ప్రాజెక్టు వ్యతరేఖ నినాదాలతో ఆదిలాబాద్ కలెక్టరేట్  ను హోరెత్తించారు. బలవంతంగా మా మా భూమి నుంచి.. మా ఆత్మనుంచి మమ్మల్ని వేరు చేస్తే జోడేఘాట్ తరహాలో తిరగబడతమని గర్జించారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో కవ్వాల్ అడవినుంచి తమను పంపించి అనాథాలను చేయాలని చూస్తే కొమరంభీం వారసత్వ సత్తాను చూపుతామని హెచ్చరించారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం , బతుకుతున్న నేల కోసం ఎంతకైనా తెగిస్తామని... ఉన్న ఊరు - కన్నతల్లితో ఉన్న  అనుభంధాన్ని తెంచాలని చూస్తే యుద్ధమే అవుతుందని ఆదివాసులు తేల్చిచెప్పారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో అభయారణ్యంలో 41 ఊర్లను ఖాళీ చేయాలని సర్కారు చేస్తున్న దుష్ట ప్రయత్నాలను తిప్పికొడతామని.. తమ బతుకులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోమని నిప్పులు చెరిగారు.  పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారని వారి వ్యవహార శైలి రౌడీలను తలపిస్తున్నదని గిరిజన నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రాజెక్టు కోసం తమ  గూడెంలో  విష సర్పాలు వదులుతున్నారని, పులులను వదిలి భయపెట్టిస్తున...

మీకు కళ్లున్నాయా.. మంత్రిగారు.

చిత్రం
మీకు కళ్లున్నాయా.. మంత్రిగారు.                                                        విరిగి పోయిన టేబుళ్లు....                                                     మాసిపోయిన బోర్డులు...                                                   రెక్కలు విరిగిన ఫ్యాన్లు.. కూలిపోయిన గోడలు..పాడువడ్డ పరిసరాలు..  విరిగిన కిటికీలు.. పలిగిన తలుపులు.. లేచిపోయిన రేకులు..రెక...

కొలువుల జాతర..

చిత్రం
కొలువుల జాతర.. సర్కారు ప్రతిష్టత్మకంగా భావిస్తున్న కొలువుల భర్తీకి చకచక ఏర్పాట్లు సాగుతున్నాయి. తాజాగా ఈ రోజు ఏపీపీఎస్సీ ఒకేసారి పది నోటిఫికేషన్లను జారీ చేసి రికార్డ్ సృష్టించింది. 2 వేల 815 ఉద్యోగాల నియమకాల కోసం ఏపీపీఎస్పీ పది నోటిఫికేషన్లను విడుదల చేసింది. పది శాఖల్లో ఉన్న ఈ ఖాళీలను ఒకేసారి భర్తీ చేస్తామని చెబుతున్నరు ఎపీపీఎస్సీ అధికారులు. ఆ వివరాలను ఓసారి చూడండి. ఒకే రోజు 10 నోటిఫికేషన్లు మొత్తం 2, 815 ఉద్యోగాల భర్తీ జనవరి నుంచి దరఖాస్తుల స్వీకరణ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ ఖాళీలు 1716 . ఏప్రిల్‌ 24 నుంచి మే 23 దాక దరఖాస్తుల స్వీకరణ జూల్‌ 1న రాత పరీక్ష పోర్ట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు: 2 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 8దాక దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 26న పరీక్ష ఫిషర్స్‌ డెవలప్‌ మెంట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు 35 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 18 దాక దరఖాస్తుల స్వీకరణ మార్చి 4న రాతపరీక్ష అసిస్టెంట్‌ ఎలక్ర్టికల్‌ ఇన్స్ పెక్టర్ ఖాళీలు: 9 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 22 దాక దరఖాస్తుల స్వీకరణ మార్చి 11న రాత పరీక్ష సీనియర్‌ ఎంటోమాలజిస్ట్‌ ఖాళీలు 11 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 దాక దరఖాస్తుల స్వీకరణ మార్చి...
చిత్రం
మాంచి నటులు మన నాయకులు...కాదంటరా ? డిసెంబర్ 13 , 2001 భారత ఆత్మలాంటి పార్టమెంట్ పై జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేసారు. ఈ దాడిలో  ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది , ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి పదేళ్లు నిండిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల సభ్యులు అమర వీరులకు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో అమరుల త్యాగాలను అవమానం చేసిన.. చేస్తున్నా.. సుప్రీం తీర్పును పెడచెవిన పెట్టిన..పెడుతున్నా సర్కారు పెద్దలు శ్రీమతి..తీవ్రవాదుల బహుమతి సోనియా గాంధీగారు. ప్రధాని.. అపప్రధాని మన్మోహన్ సింగ్.. ఆర్ధిక...అనర్ధాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ.. చిక్కుల చిదంబరం.. చెంచాలు.. పేట్లు లాంటి పెద్దలందరు పాల్గోని.. మిమ్మల్ని మేమే చంపాము.. దయచేసి మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నరు.   అంతేనా ఫోటో గ్రాఫర్లు..లేరు కదా అని చూసుకొని చమక్కులు విసురుకున్నారు.. చిరున్వులు నవ్వుకున్నారు.. ప్రాణాల్ని మింగడంలో.. కక్కడంలో నిపుణురాలైన సోనియాజీ.. ఎవరినో మింగే పనిలో ఉండి కాస్తా ఆలస్యంగా వచ్చినంటున్నారు. మొత్తానికి తమ నకిలీ ...
చిత్రం
నాయకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం బాబుల్ గావ్. స్వాతంత్ర్యం సాధించి ఆరున్నర దశాబ్ధాలు గడుస్తున్న ఇప్పటికి దేశంలో చాల గ్రామాలకు కనీస సౌకర్యాలే లేవు. ఇలాంటి దౌర్భగ్యమైన స్థితిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కుగ్రామమే నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం బాబుల్ గావ్. 1500 జనాభా కలిగిన ఈ గ్రామానికి ఇప్పటికి దారి లేదు.. కరెంట్ లేదు.. రక్షిత మంచినీరు లేవు.. రోగమోస్తే ఆదుకునేందుకు ఓ డాక్టర్ గానీ.. ఆసుపత్రిగానీ లేవ్వు.  ఉన్న చిన్నపాటి స్కూల్ కు టీచర్లు ఏ పదిరోజులకొసారిగాని రారు. సకల దారిద్ర్యాలు ఒకేచోట నివసిస్తే ఎలా ఉంటదో.. బాబుల్ గావ్ అచ్చం అలానే ఉంది. బాబుల్ గావ్ ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. రోగాల బారిన అనేక మంది చనిపోతున్న అధికారులు ఇప్పటికి స్పందించిన పాపన పోవడంలేదు. ఇక గ్రామాన్ని చుట్టుముట్టిన కౌలస్ వాగు దాటలంటే బ్రిడ్జి లేక అనేక మంది రోగులు కళ్లముందరే ప్రాణాలు విడుస్తున్నరు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారటం లేదంటున్నరు బాబుల్ గావ్ గ్రామస్తులు.. సర్కారు అధికారుల తీరు పట్ల తీవ్ర మనోవేదనకు గురవుతన్నరు బాబుల్ గావ్ పల్లే జనం. అధికారులు.ప్రజాప్రతిన...