ఇదీ ఆసుపత్రే.. నమ్మాలి అంతే. ఇది నల్లగొండ జిల్లా కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా నలుముల ఉన్న పేద ప్రజలకు కొంతలో కొంత మెరుగైన వైద్యం అందించే ఏకైక ఆసుపత్రి.. పోయిన సంవత్సరంలో మే నెలలో ఈ ఆసుపత్రి స్దాయిని 250 పడకలనుంచి 400 పడకలకు పెంచుతున్నట్లు స్వయాన ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటూ జీఓ లను విడుదల చేసింది.. ప్రభుత్వం జీఓ విడుదల చేసి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా నిధులు విడుదల కాలేదు.. ఒక్క అదనపు సిబ్బందిని గానీ , డాక్టర్లను , వసతులను కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందక సౌకర్యాలు నేలపైనే పడుకుంటున్నరు. మాములు వాళ్ల సంగతి అలా ఉంచితే ప్రసవం కోసం వచ్చే మహిళలు పడకలు లేక నేలపైనే పడుకుంటూ పడరాని పాట్లు పడుతున్నరు. పేరు గోప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పేరుకేమో పెద్దఆసుపత్రి వసతులేమో చిన్నసుపత్రి అన్నట్లు తయారైందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు...
పోస్ట్‌లు
చూసుకుందాం రండి...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
చూసుకుందాం రండి... టైగర్ ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. ప్రాజెక్టు వ్యతరేఖ నినాదాలతో ఆదిలాబాద్ కలెక్టరేట్ ను హోరెత్తించారు. బలవంతంగా మా మా భూమి నుంచి.. మా ఆత్మనుంచి మమ్మల్ని వేరు చేస్తే జోడేఘాట్ తరహాలో తిరగబడతమని గర్జించారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో కవ్వాల్ అడవినుంచి తమను పంపించి అనాథాలను చేయాలని చూస్తే కొమరంభీం వారసత్వ సత్తాను చూపుతామని హెచ్చరించారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం , బతుకుతున్న నేల కోసం ఎంతకైనా తెగిస్తామని... ఉన్న ఊరు - కన్నతల్లితో ఉన్న అనుభంధాన్ని తెంచాలని చూస్తే యుద్ధమే అవుతుందని ఆదివాసులు తేల్చిచెప్పారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో అభయారణ్యంలో 41 ఊర్లను ఖాళీ చేయాలని సర్కారు చేస్తున్న దుష్ట ప్రయత్నాలను తిప్పికొడతామని.. తమ బతుకులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోమని నిప్పులు చెరిగారు. పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారని వారి వ్యవహార శైలి రౌడీలను తలపిస్తున్నదని గిరిజన నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రాజెక్టు కోసం తమ గూడెంలో విష సర్పాలు వదులుతున్నారని, పులులను వదిలి భయపెట్టిస్తున...
కొలువుల జాతర..
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కొలువుల జాతర.. సర్కారు ప్రతిష్టత్మకంగా భావిస్తున్న కొలువుల భర్తీకి చకచక ఏర్పాట్లు సాగుతున్నాయి. తాజాగా ఈ రోజు ఏపీపీఎస్సీ ఒకేసారి పది నోటిఫికేషన్లను జారీ చేసి రికార్డ్ సృష్టించింది. 2 వేల 815 ఉద్యోగాల నియమకాల కోసం ఏపీపీఎస్పీ పది నోటిఫికేషన్లను విడుదల చేసింది. పది శాఖల్లో ఉన్న ఈ ఖాళీలను ఒకేసారి భర్తీ చేస్తామని చెబుతున్నరు ఎపీపీఎస్సీ అధికారులు. ఆ వివరాలను ఓసారి చూడండి. ఒకే రోజు 10 నోటిఫికేషన్లు మొత్తం 2, 815 ఉద్యోగాల భర్తీ జనవరి నుంచి దరఖాస్తుల స్వీకరణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఖాళీలు 1716 . ఏప్రిల్ 24 నుంచి మే 23 దాక దరఖాస్తుల స్వీకరణ జూల్ 1న రాత పరీక్ష పోర్ట్ ఆఫీసర్స్ పోస్టులు: 2 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 8దాక దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 26న పరీక్ష ఫిషర్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్స్ పోస్టులు 35 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 18 దాక దరఖాస్తుల స్వీకరణ మార్చి 4న రాతపరీక్ష అసిస్టెంట్ ఎలక్ర్టికల్ ఇన్స్ పెక్టర్ ఖాళీలు: 9 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 22 దాక దరఖాస్తుల స్వీకరణ మార్చి 11న రాత పరీక్ష సీనియర్ ఎంటోమాలజిస్ట్ ఖాళీలు 11 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 దాక దరఖాస్తుల స్వీకరణ మార్చి...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
మాంచి నటులు మన నాయకులు...కాదంటరా ? డిసెంబర్ 13 , 2001 భారత ఆత్మలాంటి పార్టమెంట్ పై జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేసారు. ఈ దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది , ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి పదేళ్లు నిండిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల సభ్యులు అమర వీరులకు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో అమరుల త్యాగాలను అవమానం చేసిన.. చేస్తున్నా.. సుప్రీం తీర్పును పెడచెవిన పెట్టిన..పెడుతున్నా సర్కారు పెద్దలు శ్రీమతి..తీవ్రవాదుల బహుమతి సోనియా గాంధీగారు. ప్రధాని.. అపప్రధాని మన్మోహన్ సింగ్.. ఆర్ధిక...అనర్ధాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ.. చిక్కుల చిదంబరం.. చెంచాలు.. పేట్లు లాంటి పెద్దలందరు పాల్గోని.. మిమ్మల్ని మేమే చంపాము.. దయచేసి మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నరు. అంతేనా ఫోటో గ్రాఫర్లు..లేరు కదా అని చూసుకొని చమక్కులు విసురుకున్నారు.. చిరున్వులు నవ్వుకున్నారు.. ప్రాణాల్ని మింగడంలో.. కక్కడంలో నిపుణురాలైన సోనియాజీ.. ఎవరినో మింగే పనిలో ఉండి కాస్తా ఆలస్యంగా వచ్చినంటున్నారు. మొత్తానికి తమ నకిలీ ...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
నాయకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం బాబుల్ గావ్. స్వాతంత్ర్యం సాధించి ఆరున్నర దశాబ్ధాలు గడుస్తున్న ఇప్పటికి దేశంలో చాల గ్రామాలకు కనీస సౌకర్యాలే లేవు. ఇలాంటి దౌర్భగ్యమైన స్థితిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కుగ్రామమే నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం బాబుల్ గావ్. 1500 జనాభా కలిగిన ఈ గ్రామానికి ఇప్పటికి దారి లేదు.. కరెంట్ లేదు.. రక్షిత మంచినీరు లేవు.. రోగమోస్తే ఆదుకునేందుకు ఓ డాక్టర్ గానీ.. ఆసుపత్రిగానీ లేవ్వు. ఉన్న చిన్నపాటి స్కూల్ కు టీచర్లు ఏ పదిరోజులకొసారిగాని రారు. సకల దారిద్ర్యాలు ఒకేచోట నివసిస్తే ఎలా ఉంటదో.. బాబుల్ గావ్ అచ్చం అలానే ఉంది. బాబుల్ గావ్ ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. రోగాల బారిన అనేక మంది చనిపోతున్న అధికారులు ఇప్పటికి స్పందించిన పాపన పోవడంలేదు. ఇక గ్రామాన్ని చుట్టుముట్టిన కౌలస్ వాగు దాటలంటే బ్రిడ్జి లేక అనేక మంది రోగులు కళ్లముందరే ప్రాణాలు విడుస్తున్నరు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారటం లేదంటున్నరు బాబుల్ గావ్ గ్రామస్తులు.. సర్కారు అధికారుల తీరు పట్ల తీవ్ర మనోవేదనకు గురవుతన్నరు బాబుల్ గావ్ పల్లే జనం. అధికారులు.ప్రజాప్రతిన...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వాచ్ డాగ్ సర్వే .. ప్రపంచంలో నిజాయితీ పరులైన ప్రజలు ఎక్కడున్నరో తెలుసా.. ? చేయితడపకుండ పనిముట్టని లంచగొండులెవరో తెలుసా. ? లంచగొండుల దేశాల్లో మన ప్లేసేంటో తెలుసా.. ? అయితే ఓసారి జర్మన్ వాచ్ డాగ్ ఆర్గానైజేషన్ జరిపిన సర్వే చూడండి. లంచం.. ఈ మాట వింటే చాలు జనం హడలెత్తిపోతున్నరు. జేబులు తడుముకొని పరేషాన్ అవున్నరు. అడిగినంత ఇచ్చుకోకుంటే పనులు జరగవని బెంగపెట్టుకుంటున్నరు. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతయని ఖంగారుపడుతున్నరు. అందుకే లంచగొండులు అడిగినంత ముట్టచెప్పి పనులు చేయించుకుంటున్నరు. అప్పో సప్పో చేసి కాలం వెల్లదీసుకుంటున్నరు. లంచగొండిల చేతికి చిక్కి విలవిల్లాడిపోతున్నరు. లంచం అన్ని దేశాల్లో ఉంది. అయితే లంచగొండుల్లో ఫస్ట్ ఎవరన్న సందేహం చాల మంది బుర్రలను తొలుస్తున్న టైంలో.. లంచగొండిలపై విస్తృతంగా సర్వే చేసిన జర్మన్ వాచ్ డాగ్ ఆర్గానైజేషన్..ప్రపంచంలో సోమాలియన్లు..నార్త్ కోరియన్లు భయంకరమైన లంచగొండులని తేల్చింది. అంతే కాదు ప్రపంచంలో లంచాలకు దూరంగా ఉండే కంట్రీ న్యూజిలాండ్ అని ర్యాంకింగ్ ఇచ్చింది. లంచాలకు దూరంగా ఉండే జనాల్ని లెక్కలోకి తీసుకున్న వాచ్ డాగ్ సర్వే.. అతి ...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
నీ కోసం .... నవ్వులు పువ్వుల్లా విరబూయాలి... కన్నులు చుక్కల్లా మెరువాలి... పెదాలు మందాలరలై మురియాలి.. నిన్ను తాకే ప్రతి స్పర్శ... తన అనుభూతిని మరచిపోవాలి.. నిన్ను మురిపించాలని వీచే చిరుగాలి.. తనే మైమరచిపోవాలి.. నిన్ను ఆనంద సాగరంలో ముంచెత్తాలని తపనపడే.. ఆలల సోయాగం... నీ ఆత్మీయత ప్రవహనికి అచ్చెరువొందాలి.. నీ మనసును నిండాలని ఆరాటపడే వెన్నెల.. తనను తాను నిండిపోవాలి... ఒక ఉషోదయానికి పరిచయం అక్కరలేదు.. ఒక ఊహకు చిరునామ అక్కరలేదు.. ఒక స్నేహనికి మాటలు అక్కరలేదు.. స్నేహం భాష లేని భావం.. స్నేహం తన..మన అన్న తేడాలేని త్యాగం.. స్నేహం నమ్మకాల నిలయం.. స్నేహం ఆత్మీయతల ఆలయం.. నచ్చితే ప్రాణం... చెప్పడానికి మాటలు లేని బంధం... నీ కోసం .... నీ నేస్తం...
గెలుపును గుప్పిట పట్టు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
గెలుపును గుప్పిట పట్టు! మేఘాలు కమ్ముకొస్తున్నయని బెంగవద్దు అలలు ఎగసిపడుతున్నయని భయం వద్దు.. హోరుగాలులు వీస్తున్నయని జంకు వద్దు.. పిడుగులు దడేలుమనిపిస్తున్నయని వణకు వద్దు.. వాటి పని అవి చేస్తున్నప్పుడు.. తిరగబడే నీ గుణాన్ని తరిమికొట్టె నీ ధైర్యాన్ని నువ్వెందుకు విస్మరిస్తావ్.. నువ్వె కదా పోరాడాల్సింది.. నువ్వె కదా విజేతగా నిలవాల్సింది.. నువ్వె కదా విజయ బావుటా ఎగరవేయాల్సింది.. ఎందుకు నీ కళ్లలో అపనమ్మకం ? ఇంకేందుకు ఆ గుండేలో సంశయం ? వేళ్లు బిగిసుకుపోయి పిడికిలవుతుంటే.. పాదాలు కదనానికి కాలుదువ్వుతుంటే.. కర్తవ్యాన్ని మరిచి.. చేయాల్సిన క్రియలు విడిచి.. ఎందుకు భయపడతావ్.. ? గెలుపును ఒడిసిపట్టాలనే కదా.. నీ పోరాటం.. ఓటమి అంతు చూడలనే కదా నీ ఆరాటం.. ఓటమి ఎదురైందని కుంగిపోతే.. ఎదురుదెబ్బ తగిలిందని కృషించిపోతే.. అడ్డంకులు ఎదురవుతున్నయని ఆగిపోతే.. నువ్వు విజయాన్ని శోధించే విద్యార్థివి ఎలా అవుతావు.. ఓటమిపై దండెత్తే వీరుడవు ఎలా అవుతావు.. రానీ ఎన్ని ఓటములు వస్తాయో.. తాకనీ ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతాయో.. ...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
బాబువి లత్కోర్ రాజకీయాలు:కేసీఆర్ చంద్రబాబు ఇంటి పేరు నమ్మక ద్రోహం, ఒంటి పేరు నయవంచన, అసలు పేరు కుంభకోణం అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసే రాజకీయాలన్ని లత్కోర్‌వేనని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఐదారు రోజులుగా చంద్రబాబు తొట్టిగ్యాంగ్ కారు కూతలు కూస్తుందని మండిపడ్డారు. బాబు చరిత్ర ప్రపంచానికి తెలుసన్నారు. ఆయన అవినీతి, దుర్మార్గాలపై పుంకానుపుంఖాలుగా పుస్తకాలు వచ్చాయని చెప్పారు. . అడుగుదీసి అడుగెస్తే బాబుది బినామీ బతుకు అని దుయ్యబట్టారు. తాను హెరిటేజ్ కంపెనీ, కూరగాయాల కంపెనీ పెట్టుకోలేదని చెప్పారు. అక్రమ సొమ్ము సంపాదించుకునే అలవాటు మీకుందని చెప్పారు. తాను నమస్తే తెలంగాణ దిన పత్రికలో రూ.4 కోట్లు, టీ న్యూస్‌లో రూ. 55 లక్షలు పెట్టుబడులు పెట్టానని తెలిపారు. ఈ డబ్బంతా మాజీ ఎంపీ వినోద్ తమ్ముణ్ణి వద్ద అప్పు తీసుకున్నానని పేర్కొన్నారు. తాను పెట్టిందంతా వైట్ మనీ అని స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణ ఎండీకి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు బయట వ్యాపారాలు ఉంటే మేం ఏం చేయాలని ప్రశ్నించారు. అది ఆయన ...
మిస్టర్ ఛీప్ మినిస్టర్...!
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
మిస్టర్ ఛీప్ మినిస్టర్...! ఒక ప్రశ్న ఉదయించింది ఒక పిడకిలి పైకెగిసింది. ఒక నినాదాం గర్జిస్తుంది. కేసులు పెట్టుకోండి అంటూ... తెగువ సవాళ్లు విసురుతుంది. సర్కారు వల్లవుతుందా.. ? దిక్కరించిన గొంతులను జైల్లో పెట్టడానికి.. నియంతవల్లవుతుందా.. ? నింగికెగసిన చైతన్యాన్ని బంధించడానికి.. మోనార్కుల వల్లవుతుందా ? మోసాలను కప్పిపుచ్చడానికి నెవర్.. నిప్పులు కక్కె సూర్యున్ని పట్టుకోవడం ఉస్పెనలా ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం.. రెండోక్కటే. ఆనాటి పగిడిద్దరాజు త్యాగం.. నేడు శ్రీకాంత చారి వీర మరణం.. చరిత్ర నుంచి చెరిపెయ్యగలరా.. ? జైల్లో బంధీచేయ్యలరా.. ? ఆకాంక్షల గొంతుకను ఆత్మగౌరవ వీచికలను సొప్ప బెండ్ల లాంటీ నీ సైన్యం.. పూచిక పుల్లలాంటి నీ సేనలు ఆపగలవా.. ? బంధూకులను దనుమాడిన బందగీ వారసత్వం గుత్పలు పట్టి తరిమిన సాకలి ఐలమ్మ సహసం ఒడిషెలు పట్టి తరిమిన దొడ్డికొమురన్న పౌరుషం విల్లంబులు ఎక్కుపెట్టిన కోమురం భీం రౌద్రం వారసత్వమై రక్తం చుక్కచుక్క నిండిఉంటే నీ కుట్రలు.. నీ కుతంత్రాలు.. నీ ఎత్తులు నీ ఎస్మాలు.. నీ 177 జీవోలు నీ అమ్మడాలు కొనడాలు.. అపగలవా మిస్టర్ ఛీఫ్ మినష్టర...