పోస్ట్‌లు

హైదరాబాద్ కి కాలం మూడింది..!

చిత్రం
              వర్షం వస్తే చాలు ఫస్ట్ మునిగిపోయిందని పేపర్లో కనిపిం చే మొదటి పేరు ముంబై. దేశానికి ఆర్ధిక రాజధాని అయినా మునిగి పోతుంటే కళ్ళప్పగించి సినిమా చూడటం తప్పా.. ఏం చేయలేని నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంది సర్కారు. స్వార్ధపరుల ఆపేక్షణ.. అధికారుల చేతివాటం... నాయకుల నిర్లక్ష్యం కలగలిసి ముంబాయి మొత్తాన్నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.                   ఇక సాఫ్ట్ వేర్ రాజధాని హైదరాబాద్ పరిస్థితి  ముంబాయికి భిన్నమేమి కాదు.. ఇప్పటికే చిన్నపాటి వర్షానికి జలమయమౌతున్న నగర రోడ్లు.. రానున్న కొద్ది రోజుల్లో తీవ్రరూపం దాల్చక తప్పదు.. అందుకు కనుమరుగవుతున్న చెరువులే నిదర్శనం..           

ఇదెక్కడి నీతి ??????

చిత్రం
ఇదెక్కడి నీతి ?????? సినిమాల్లో ఇలా ??              చూస్తే దేవుడే దిగి వచ్చినట్టు అక్టింగులు... షూటింగ్ టైములో నోటికోచిన్నట్టు నీతులు చెప్తారు.. మన వెర్రి ఫ్యాన్స్ వాళ్ళనే ఆకాశం నుంచి ఉడిపడ్డ మహానుభావులని లేని లేని పోజులు కొడతరు... ఇక్కడి వరకు బానే ఉంది.. వీళ్ళు కేవలం రీలు మీద మాత్రమే హీరోలు.. బయట వీళ్ళ విశ్వరూపం దొంగల ముటలలో మేమ్బెర్లల ఉంటుంది.. నమ్మడం లేదా అయితే క్రింద వాళ్ళ సపోర్ట్ ఎవరికీ ఉందొ చుడండి... నిజ జీవితంలో ఇలా??????                                                       స్క్రీన్ పై ఎన్ని నీతులో బాబు...                               స్క్రీన్ పై దేవుడి  ...                                   ...
చిత్రం
బడి పిల్లలా  బలి పశువులా ..?                                                                                                                                                                 ...

మారని కథ..అభిమానుల వ్యథ..!

చిత్రం
మారని కథ..అభిమానుల వ్యథ.. !        ఆడిగెలవరా బాబు అంటే.. పక్కోడు ఓడితే ఆడతాం అంటూ కూర్చునే స్థితికి దిగజారింది టీంఇండియా. అజారుద్దీన్ వేసినా దారిపై గంగూలీ మాంచి రోడ్డెసిస్తే.. తేరగా వరల్డ్ కప్ తీసుకున్న ధోని..ఇప్పుడు గెలిపియ్యవయ్యా అంటే మాత్రం పక్క టీం ఢమాల్ కావాలని పూజలు చేస్తున్నాడు. ఏం లాభం మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. ఇదీ అంతే. జీవితం అన్నాక కాస్తా మంచి ఆలోచనలు పెద్ద,చిన్నవాళ్లను గౌరవించే సంస్కారం ఉండాలి. లేకపోతే వరల్డ్ కప్ తీసుకువచ్చిన సింగ్ నేతృత్వంలోనే టీంఇండియా అథ:పాతాలానికి చేరుకోవడం మాత్రం ఖాయం.  ఇప్పటికే చాలా మారాల్సిన ధోని మాత్రం ఇంకా తన మార్క్ పాలిటిక్స్ కొనసాగిస్తునే ఉన్నాడు. ఇంకా నీరో చక్రవర్తిలా నియంత రాజ్యంగా మార్చలనుకుంటున్నాడు. అందులో భాగంగానే తన దిక్కుమాలిన రాజకీయాలతో వీరేంద్ర సెహ్వాగ్ ను ఇంట్లో కూర్చోబెట్టాడు. అంతేనా పైనా కూల్ గా కనిపించే ధోని ఆ మధ్య యువరాజ్ గేమ్ తోను ఆడుకున్నాడు. పాపం యువీకి ఆరోగ్య సమస్యతో టీంకు దూరమయ్యాడు గానీ ఖచ్చితంగా ధోనీ.. యువీని కూడ తన పాలిట్రిక్స్ తో ఇంట్లో కూర్చోబెట్టేవాడే కావచ్చు. ధోని ఎల్లో ఆల...

సచిన్ వంద..మ్యాచ్ గోవిందా..!

చిత్రం
సచిన్ వంద..మ్యాచ్ గోవిందా.. !      ఎన్నాళ్లుగానో ఎదిరి చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల సెంచరీ అయితే  అయ్యింది కానీ..పసికూన బంగ్లాదేశ్ చేతిలో  టీంఇండియా చిత్తుగా ఓడిపోయింది. సెంచరీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదిరి  చూసిన సచిన్... 147 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్స్ తో      114 పరుగులు సాధించాడు. అయితే ఏం లాభం  ఎప్పటిలాగే తన శతకం కోసం అమూల్యమైన 33 బాల్స్ ను హృదా చేసాడు.  ఈ 33 బంతుల్లో బాల్ కు ఒక పరుగు వస్తే జట్టు స్కోరు 322 పరుగులు అయ్యేది. ఇక సచిన్ 44 వ ఓవర్ వరకు ఉన్నాడు కాబట్టి..లాస్ట్ మూవ్ మెంట్ లో బాల్ కు రెండు పరుగులు వచ్చినా 355 పరుగుల భారీ స్కోర్ అయ్యేది కానీ ఏం చేస్తాం అక్కడ ఆడేది సచిన్.. ఆపై వంద కోసం వంద కోట్ల మంది ఎదిరి చూపులు.. దేశం పరువు గంగలో కలిసిపోతే మనకెందుకు.. ప్రపంచం ముందు కంట్రీ పరాజీతం అయితే లెక్కెందుకు.. మనకు కావాల్సింది సచిన్ సెంచరీ అనుకునే పిచ్చి అభిమానులు ఉన్నప్పుడు దేశం ఎప్పుడు బాగుపడుతుంది. ఒక్క క్రికెటే కాదు దేంట్లోనైనా ఇదే పిచ్చి అభిమానం.. వెర్రి ఆలోచన...

అతి అరుదైన సంపద అటవిపాలు..

చిత్రం
అతి అరుదైన సంపద అటవిపాలు.. అక్కడి రాళ్లు ఓ చరిత్రకు పురుడు పోసినయి. ఆ కొండలు ఘనమైన వారసత్వ సంపదను  కడుపులో దాచుకున్నయి. ప్రపంచంలో ఎత్తైన హుస్సెన్ సాగర్ బుద్ధుడికి తనువునిచ్చిన శిలలు.. వాటితో పురుడు పోసుకున్న అపురూపమైన శివుని ప్రతిమలు, లింగాలు నేడు రాళ్లు రప్పలు, చెట్ల పొదల మాటున అనాధలుగా మిగిలినయి.     అద్భతమైన పర్యాటక   క్షేత్రంగా అభివృద్ధి చెందే అన్ని అవకాశాలు ఉన్నా..పాలకుల నిర్లక్ష్యంతో బోసిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా రాయగిరి కొండల చరిత్రపై అధ్యయనం చేసి   అక్కడి సంపదను రక్షించాలి.. పురావస్తు శాఖ అధికారులు పరిశోధన చేసి ఆలయానికి   సంబంధించిన ప్రతి విషయాన్ని అక్షరికరించాలి. పాలకులు నిద్రమత్తును వీడి అరుదైనా   విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించి భవిష్యత్ తరాలకు అందించాలి.

తలపున కృష్ణమ్మ పారిన తలరాత మారడం లేదు.

చిత్రం
తలపున కృష్ణమ్మ పారిన తలరాత మారడం లేదు.       తలపున కృష్ణమ్మ పారుతున్న చెంబెడు నీళ్లు రావు.  కోట్ల రూపాయలతో సర్కారు ‌ప్రాజెక్టులు కట్టిన చుక్క నీళ్లు అందవు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవకుంటే గొంతు తడవని పరిస్థితి. పదుల మీటర్లు బోర్లు వేసి.. భగీరథ ప్రయత్నం చేసిన తీరని నీటి కష్టాలు. పాలకుల నిర్లక్ష్యం.. కాలం మిగిల్చిన కరువుతో అల్లాడుతున్న నల్లగొండ జిల్లా గిరిజనుల తాగు సాగు నీటి వేతలు అన్ని ఇన్ని కావు. పథకాల పేర ఊదరగొట్టే పాలకులు గిరిజనులను పట్టించుకున్న పాపానపోవడంతో నానా అవస్థలు పడుతున్నరు. ఓట్లప్పుడు ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం, తాగునీటి కష్టాలు తీరుస్తాం. ప్రాజెక్టులను కట్టి సాగు బాధలు ఉండవని అరచేతిలో స్వర్గం చూపించే నాయకులు.. ఇప్పుడు మాత్రం తాండాల దిక్కు చూసే ప్రయత్నం కూడ చేయడం లేదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నరు. నీళ్ల కోసం.. తమ పిల్లల చదువులు ఆగమైపోతున్నయని వారు దిగులుపుడుతున్నరు.  ఇప్పటికైనా  సర్కారు స్పందించి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.  

గూడు చెదిరింది.. గుండె పగిలింది.

చిత్రం
గూడు చెదిరింది..  గుండె పగిలింది.       గూడు నిచ్చె గుడిసెలు కాలీ బూడిదైపోయినయి.నీడ కరువయ్యింది. కండ్ల ముందే కాలీపోయిన గూడును చూసి గుండెలు కూలీపోయినయి. పిల్లల పెండ్లి కోసం దాచిన డబ్బులు..అందరు కలిసి పోగేసుకున్న చిట్టీల మూటలు కాగితాల్లా కాలిపోయినయి. అంతేకాదు ప్రాణానికి ప్రాణంల పెంచుకున్న పిసిపాపలు.. కనిపెంచిన పెద్దవాళ్లు గుడిసెల్లో పడి అగ్నికి ఆహుతవుతుంటే బోరున విలపించడం మినహా ఎం చేయగలరు.. వంద గుడిసెలు ఒక్కసారిగా అంటుకోవడంతో ఏం చేయాలో తెలియక లబోదిబోమంటు ఏడుస్తున్నరు. మా బతుకులెట్లరా.. దేవుడా అంటూ ఏడుస్తున్నరు.   చుట్టపు చూపుగా వచ్చిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదుకుంటమని చెప్పి జారుకున్నరు. దీంతో ఎలా బతకాలో.. ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నరు ఈ పేద జనం. సర్కారు ఆదుకుంటుందన్న ఆశలేదని.. ఎవరైనా దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నరు రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ మండలం గుండ్లపోచం పల్లిలో అగ్నిప్రమాదంలో గుడిసెలను కోల్పోయిన జనం.  

ఆదివాసులంటే అంత అలుసా..?

చిత్రం
ఆదివాసులంటే అంత అలుసా.. ?       మేడారం జాతరపై సర్కారుకు ఏం హక్కుంది ? అసలు సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఏం చేసిందని ? ఇంకా ఎన్నాళ్లు ఆదివాసులు పాలకుల పాదల కింద నలిగిపోవాలి ? వంద కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అన్ని హక్కులు పొడుచుకు వస్తాయా ? అధికారం ఉంది కదా అని అన్నిట్ని గుప్పిట్లో పెట్టుకోవడం సమంజసమేనా ? మేడారం జాతరకు సర్కారుకు సంబంధం ఎక్కడిది ? సర్కారు సహాయం కావాలని ఆదివాసులు పాలకులను ఏనాడైనా అడిగారా ? మాకు ఆదాయం కావాలని ఎవరితోనైనా చర్చలు జరిపారా ? మరి ఎందుకు సర్కారు పెత్తనం చేస్తుంది. ఎందుకు మేడారం జాతర పూజారులను అడుక్కునే వారిగా మిగిల్చుతుంది ? హుండీ ఆదాయం కోసం ఎందుకు దేబికరించే స్థితికి దిగజార్చింది ? షాపుల టెండర్ల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను ఏం చేస్తున్నారు ? ఎందుకు ఆదివాసీ ఆత్మబంధులు ఇలవేల్పు గద్దెలపై పోలీసు బూట్లను ప్రవేశపెడుతుంది ? ఎందుకు ఆదివాసీల గుండెలపై తుపాకులను ఎక్కుపెడుతుంది ? ఎందుకు పరమ పవిత్రంగా భావించే సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల చుట్టు ఇనుపకంచెలు వేసి బంధిస్తుంది. అధికారం ఉన్నది ప్రజల మనోభావాలన...

వాలెంటైన్స్ డే.

చిత్రం
వాలెంటైన్స్ డే. ( ఒక నిజం.. అందమైన అబద్ధం)         ప్రపంచాన్ని నడిపించే ఓ అద్భతం ప్రేమ. హృదయాల్ని పరవశింప చేసే ఓ పరిచయం  ప్రేమ. జగత్తును నడిపించే ఓ గమ్మత్తు ప్రేమ. ఒకరి కోసం మరొకరు చేసే త్యాగానికి నిలువెత్తు గురుతు ప్రేమ. మనిషి సంబంధాల్లో ప్రేమకు ఎప్పుడూ అగ్రస్థానమే. అందుకే ప్రేమ గురించి ఎన్ని చెప్పినా తక్కువే.. అలాంటి ప్రేమకు ఓ రోజుంటే అదే ప్రేమికుల రోజు.  స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించే ప్రతిఒక్కరికి వాలెంటైన్స్ డే ఓ సరికొత్త రోజు.           ప్రేమ.. ఇద్దరు మనుషుల మధ్య అల్లుకున్న ఓ తియ్యని బంధం. రెండు హృదయాల నడుమ పెనవేసుకుపోయిన అనుబంధం. ఎప్పుడు నేనున్నానంటు నీడల తోడుండే ఓ ఆత్మీయ స్నేహం ప్రేమ. అలాంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు. రాస్తూ పొతే పేజీలే మిగలవు. అందుకే ప్రేమ ఇజికోల్ట్ ప్రేమ అంటాడో లెక్కల ప్రేమికుడు. ఎవ్వరి భావన ఎదైనా ప్రేమ మాత్రం వెలకట్టలేనిది. విడదీయడానికి మనిషికి సాధ్యం కానిది.          ప్రేమ అంటే అంతా మంచే ఉంటుందని మాత్రం ...

నిజం తెలిసింది.

చిత్రం
నిజం తెలిసింది. ( అమ్మ బాబోయ్ ఇంత దొంగ సొమ్మా.. ? ) సామాన్య ప్రజల సొమ్ములు మింగి స్విస్ లో దాచుకున్న నల్లకుబేరుల బాగోతం సీబీఐ బట్టబయలు చేసింది. దేశం యావత్తుకు కళ్లు బైర్లు కమ్మే నిప్పులాంటి నిజాలను వెల్లడించింది. భారతీయ నల్లధన దొంగలు 25 లక్షల కోట్లకు పైగా దొంగసొత్తునను విదేశాల్లో దాచుకున్నరని .. సీబీఐ డైరెక్టర్ ఏ.పి సింగ్ చెప్పారు. స్విస్ లో మూలుగుతున్న నోట్ల కట్టలన్నీ భారతీయుల బడా బాబులవేనని ఆయన తేల్చి చెప్పారు. మారిషస్, స్విట్జర్లాండ్ బ్యాంకులు నల్లధనం దాచుకోవటానికి సురక్షితమైనవిగా భారతీయులు భావిస్తున్నరని ఆయన తెలిపారు. అంతేకాదు దేశంలో 55 శాతం మంది మహానుభావులు అవినీతి పరులేనని సింగ్ జీ స్పష్టం చేశారు. ఇంత పెద్ద నిజం తెలిసినా.. ఆ నల్లధనాన్ని తిరిగి తెప్పించడం ఆషామాషీ వ్యవహారం కాకపోవటంతో ఇది కేవలం మీడియా వార్తగానే మిగిలిపోతుందంటున్నరు అవినీతిపై యుద్ధం చేస్తున్న ఉద్యమకారులు. దేశాన్ని పాలించే  పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఆయా దేశాలకు చట్టపరంగా విజ్ఙప్తి చేసి.. దొంగ సొత్తును తెప్పించటం పెద్ద పనేకాదంటున్నరు కొందరు విశ్లేషకులు. సర్కారుకు చిత్తశుద్ధి లేదు కాబట్టి...

సమ్మక్క - సారలమ్మ చరిత్ర .. ఓ పరిశోధన !

చిత్రం
  సమ్మక్క - సారలమ్మ చరిత్ర .. ఓ పరిశోధన ! సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకున్తమనే విషయం అందరికి తెలిసిన.. అసలు సమ్మక్క ఎవరు..? సారలమ్మ ఎవరు? అన్న విషయాల పైన ఒక సందేహం మాత్రం కొనసాగుతున్నది.   ప్రపంచంలోని ఏ దేవుడికైనా సరే అందరూ అంగీకరించే ఓ చరిత్ర ఉంటుంది. ఏ మతాచారానికైనా ఆ మతస్థులంతా నమ్మే ఓ ఆధ్యాత్మిక పునాది ఉంటుంది. ప్రతీ దైవ సన్నిధికి ఓ స్థలపురాణం ఉంటుంది. భూమ్మీది పుట్టి గిట్టిన ఎవరి ఉనికికి సంబంధించైనా కొద్దో గొప్పో చారిత్రక ఆధారం ఉంటుంది. చివరికి ఏ రాజవంశానికి సంబంధించిన జీవనం, యుద్ధాలకు సబంధించి శాసనాలుంటాయి. కానీ అవేమీ లేకున్నా వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఆచారం మేడారం జాతర.                   వరంగల్ జిల్లా మేడారంలో ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర చరిత్ర కారులకు, సాహితీ వేత్తలకు, ఆధ్మాత్మిక పరిశోధకులకు అందని ఓ మిస్టరీ. అంతుచిక్కని సమ్మక్క సారలమ్మ అసలు కథ తెలుసుకోవడానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన గతం ఏంటి అనేది కనీసం భవిష్యత్ లో కూడా తేల...