పోస్ట్‌లు

నిజమైన నాయకులు ఎలా ఉంటారు ?

చిత్రం
వంద మంది శత్రువులతో నేను ఒంటరిగా పోరాడుతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడికి తన వ్యథను చెప్పుకున్నప్పుడు.. శ్రీకృష్ణుడు, అర్జునుడితో ఇలా అన్నాడు... "నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్" ధర్మం కోసం నిజాయితీగా పోరాడితే వందమందిని కూల్చే శక్తి నీకు విశ్వం నుంచి లభిస్తుంది అని చెప్పాడు. అదే పుతిన్ విషయంలో జరిగి ఉండవచ్చని నా భావన. లేదంటే, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 24, 2022 ప్రారంభమైంది. అంటే అక్షరాలా 4 సంవత్సరాల, 1 నెల, 24 రోజులు. బహుషా చరిత్రలో జరిగిన సుదీర్ఘ యుద్ధాల్లో ఏదో ఒక స్థానంలో ఈ యుద్ధానికి కూడా చోటు లభించి ఉండవచ్చు. అయినప్పటికి పుతిన్ ఎవ్వరి సహాయం అడగడం లేదు, ఎవ్వరిని నిందించడం లేదు, ఎవ్వరిపై నిందలు మోపలేదు. యూరప్, అమెరికా వంటి శక్తివంతమైన కూటములు, దేశాలు ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్నప్పటికి ఎక్కడా చెక్కుచెదరలేదు. పైగా రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించి అమెరికా చేసిన ఆర్ధిక విధ్వంసాన్ని కూడా చాలా ప్రొఫెషనల్ గా ఎదుర్కొంటున్నాడు పుతిన్. దాదాపు 4 లక్షల మంది సైనికులను కోల్పోయాడు, దాదాపు 300 బిలియన్ డాలర్లు తన సంపదను స్తంభింపచేసినప్పటికి ఎక్కడా వణకలేదు. ప్రపం...

17 సెప్టెంబర్ - తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగ అంశాలు...

చిత్రం
17 సెప్టెంబర్ - తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగ అంశాలు... • ఆనాటి పోరాటాన్ని కళ్లకు కట్టి : యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నాం. స్వతంత్రం రాకముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండేది. కొంతభాగం బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించే బ్రిటిష్ ఇండియాగా ఉంటే.. మిగతా భాగం సంస్థానాధీశుల పాలనలో ఉండేది. కొన్ని ప్రాంతాలు ఫ్రెంచ్, పోర్చుగీస్ వారి వలస పాలనలో ఉండేవి. ప్రపంచంలో ఏ దేశమైనా పరిణామ క్రమంలో సమగ్ర స్వరూపాన్ని సంతరించుకుంది. మన భారతదేశం కూడా అంత...

రిటైర్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్న టీ-సర్కారు

పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బాగోగుల గురించి పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తర్వాతే ఎవరైన అన్నట్టు ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రిటైరైన రోజున సన్మానంతో పాటు అన్ని చెల్లింపులు, గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఉద్యోగిని తన ఇంటి వద్ద దింపేసే ఏర్పాట్లు చేయాలని కసరత్తులు చేస్తున్న సర్కారు, ఇంతకు ముందే రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించింది. వారు నిత్యం మీసేవా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంట్లో కూర్చుని సర్కారు తెస్తున్న టీయాప్ లో ఒక ఫోటో దిగి వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. ఇక ఆ ఉద్యోగికి ప్రతి నెల బ్యాంకు అకౌంట్లో ఫించను జమ అవుతుంది. ఇప్పటి వరకు ఈ విధానం చైనాలో అమల్లో ఉంది. అయితే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి రేపో మాపో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టీ-సర్కార్

సరికొత్తగా డ్రైవింగ్ లైసెన్స్

చిత్రం
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీఏల్లో అవినీతిని అంతం చేసేందుకు పూనుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే సామాన్యులు జడుసుకునేలా చేస్తున్న బ్రోకర్ల చేతివాటానికి కళ్లెం వేయాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే భారీగా సంస్కరణలకు పూనుకుంది. ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే తతంగాన్ని పూర్తిచేసే సరికొత్తి సెల్ఫీ సిస్టానికి సిద్ధమైంది. లైసెన్స్ తీసుకోవాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి ఫోటో దిగాల్సిన పద్దతికి స్వస్తిపలికింది. టీయాప్ పోలియో యాప్ తో స్వీయ చిత్రంతో దరఖాస్తును పూరించే పద్ధతికి శ్రీకారం చుట్టుంది. ఈ పద్దతి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నరు. అయితే మరికొందరు మాత్రం ఆర్టీఏ జలగలు సరికొత్త మార్గాలు వెతుకుతరని పెదవి విరుస్తున్నరు.

త్రిపుల్ తలాక్ బిల్లుకు ఓకే చెప్పిన రాజ్యసభ

చిత్రం
త్రిపుల్ తలాక్ బిల్లుకు ఓకే చెప్పిన రాజ్యసభ ముస్లీం కుటుంబాల్లోని అమ్మాయిలకు రక్షణ కల్పించేందుకు మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కింది. 2017 లోనే సుప్రీం కొోర్ట్ త్రిపుల్ తలాక్ రాజ్యంగవిరుద్ధమని స్పష్టం చేసినా.. చట్టబద్దం చేయడంలో మన రాజకీయ వ్యవస్థ తన దౌర్భలత్వాన్ని చాటుకున్నది. సమాజానికి మంచి జరుగుతుందని తెలిసిన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్టీలన్నీ జట్లుగా విడిపోయి వికృత రాజకీయాలు చేసాయి. ప్రభుత్వం సైతం ప్రతిపక్షాల ఆరోపణలను, ఆక్షేపణలను, ఆలోచనలను విని చిన్న చిన్న సమస్యలను సరిదిద్దే ప్రయత్నం చేస్తే బావుండేది. కానీ అలా జరగకపోవడం వల్ల సమస్య ఇంత దూరం వచ్చింది. అంతేకాదు లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం కోొసం దాదాపు ఆరునెలలకు పైగా సమయం తీసుకుంది. కానీ ఎట్టకేలకు 99 మంది ఆమోదం 84 మంది సభ్యుల వ్యతిరేఖత నడుమ మూజువాణి ఓటుతో త్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లు ఆమోదం పొందడమే ఆలస్యమే ముస్లీం మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది ? టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతరులు   pollcode.com free polls

పీ.వీ కి ఘన నివాళులర్పించిన కేసిఆర్, ప్రధాని

చిత్రం
                    పీ.వీ కి ఘన నివాళులర్పించిన కేసిఆర్, ప్రధాని           ఎన్నికలు సమీపిష్తున్న వేళ.. భారత మాజీ ప్రధాని #పీవీ నరసింహారావు జయంతి ప్రాధాన్యతను సంతరించుకుంది. సోనియా, రాహులు ఇద్దరు పీవీకి కంటితుడుపుగా జయంతి నివాళులర్పిస్తే.. ప్రధాని మాత్రం ట్విట్టర్ ద్వారా పీవీని పొగడ్తలతో ముంచేశారు. పీవీ దేశానికి దిశా నిర్ధేశం చేశాడని, ఈ రోజు దేశ ఎదుగుదలకు పీవీ సంస్కరణలే కారమని, పీవీ లాంటి గొప్ప రాజనీతజ్ఞుడు దేశానికి గర్వకారణమని కీర్తించాడు. దీంతో పీవీ అభిమానులంతా.. మోదీనీ పొగడ్తలతో ముంచేస్తున్నరు.              ఇకపోతే  తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పార్టీ పీవీని నిర్లక్ష్యం చేసింది. పీవీకి కనీస మర్యాద ఇవ్వకుండా అవమానిస్తే.. ముఖ్యమంత్రి మాత్రం పీ.వీ.కి ఘన నివాళులర్పించారు. 

తెలుగు మహాసభల నిర్వహణపై ముఖ్యమంత్రి సమీక్ష

చిత్రం
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారు ప్రగతి భవన్ లో తెలుగు మహాసభల నిర్వాహణ ఏర్పాట్ల పై అధికారులతో చర్చించారు. మహాసభలకు హాజరయ్యే వేలమందికి కావల్సిన అన్నీ ఏర్పాట్లను చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాసభల్లో ఎట్లాంటి లోటుపాట్లు రాకుండా ముందగానే తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా నిర్వహాణబాధ్యులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత మొదటిసారిగా జరుగుతున్న మహాసభలు విజయవంతం చేయాలని అందుకు ప్రభుత్వం అన్నీవిధాలుగా సహాయం అందించేందుకు  సిద్ధంగా ఉందని  తేల్చిచెప్పారు.

సర్వరోగాలను నయం చేసే బ్రహ్మస్త్రం ఈ దివ్యఔషదం

చిత్రం
తయారికి కావాలసిన పదార్ధాలు : 400 గ్రాముల మెంతులు 100 గ్రాముల ఓమా 100 గ్రాముల జిలకర్ర 100 గ్రాముల నల్ల జిలకర్ర తయారీ విధానం : పై నాలుగు రకాల పదార్ధాలను తీసుకొని రాళ్లు, ఇతర చెత్త పదార్ధాలు లేకుండా శుభ్రం చేసుకొని.. పాత్రలో వేసి సన్నటి మంటపై ఏగే వరకు వేడి చేయాలి. తరువాత నాలుగు పదార్ధాలను ఒక పాత్రలో కలిపి మెత్తగా నూరాలి. తీసుకోవాలసిన విధానం : రోజు ఉదయం పరిగడుపున రెండు టీ స్పూన్లు, రాత్రి భోజనం ముగిసిన తరువాత రెండు టీ స్పూన్లు గోరు వెచ్చటి నీటిలో కలుపుకొని 41 రోజులు తాగాలి. లాభాలు : 1.        శరీరంలో పేరుకుపోయిన మలిన, మరియు విష పదార్ధములను కూకటివేళ్లతో పేకలించి వేస్తుంది. 2.     ద్రవం తాగిన పిమ్మట శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్ధములు మూత్రం, చెమట, మలం ద్వారా బయటకు విసిరివేయబడతాయి. 3.     ఈ ద్రవంను స్వీకరించిన పిదప శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పూర్తిగా తీసివేయబడుతాయి. 4.     మూడు నెలలు ఈ ద్రవాన్ని స్వీకరిస్తే శరీరంలోని వేస్ట్ కొవ్వు జీరో లెవల్ కి పడిపోతుంది. 5.     రక్...

ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గ్యాంగ్ లీడర్

చిత్రం
ఈ రోజు ఉదయం పేపర్ చూడగానే నన్ను అమితంగా ఆకర్షించిన వార్త గ్యాంగ్ లీడర్ సినిమాకు 25 యేండ్లు అనే వార్త. కారణం నేను మాటలు నేర్చుకొని కొద్ది కొద్దిగా సినిమా గురించి ఆసక్తి కనబరుస్తున్న సమయంలో.. సినిమా అంటే వండర్ అనే భావనలో నేను బ్రతుకుతున్న కాలంలో గ్యాంగ్ లీడర్ సినిమా రికార్డుల దుమ్ము దులుపుతుంది. అప్పటికి ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం గడిచిపోయిందట.. శతదినోత్సవం కూడా జరుపుకుందట. అప్పటికి మా ఊరికి ఆ సినిమా అప్పుడే విడుదల అయ్యింది.           చిరంజీవి, విజయశాంతి, నిర్మలమ్మ, అల్లు రామలింగయ్య, మురళీమోహన్ తదితర తారాగణం, బప్పీలహరి సంగీతం అందించిన సంగీతం అప్పుడు ఏ రేడియోలో విన్న దుమ్ము రేపుతుండేది. అలా నాకు గ్యాంగ్ లీడర్ సినిమా గురించి తెలిసింది. 

ఫ్లిప్ కార్ట్ గురించి

ఫ్లిప్ కార్ట్ గురించి ప్రపంచానికంతా తెలిసిందే అయినా.. మనదేశంలో సామాన్యులు సగానికి మించి ఆదాయాన్ని ఆన్ లైన్ షాపింగ్ కే కేటాయిస్తున్నారు. దీంతో సంపాదించింది కాస్త క్షణాల్లో కరిగిపోవడం.. నాణ్యత కలిగిన వస్తువులు రాకపోవడంతో మధ్యతరగతి కుటుంబాల్లో తీరని వేదన వ్యక్తం అవుతున్నాయి. అందుకే నాకు తెలిసి ఫ్లిప్ కార్ట్ అన్ లైన్ సైట్ లో అత్యంత నాణ్యమైన వస్తువులు దొరకుతాయని నా అనుభవంలో తెలిసింది. అందుకే అన్ లైన్ షాపింగ్ చేయాలనుకునే సోదరి సోదరులకు నేను ఫ్లిప్ కార్ట్ అన్ లైన్ షాపింగ్ సైట్ ను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఫ్లిప్ కార్ట్ కు సంబంధించిన లింక్ ను పోస్ట్ చేస్తున్నాను. ఎదైనా కొనాలనుకుంటే జస్ట్ ఆ లింక్ పై ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఆ సైట్ కు మిమ్మల్ని తీసుకెలుతుంది. http://www.flipkart.com/

తెలంగాణ రేపటి ఆశాదీపం

చిత్రం
తెలంగాణ నిండా యువత కోటి ఆశలతో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంది. నిన్నటి వరకు జీవితాలను ఫణంగా పెట్టి స్వరాష్ట్రం కోసం పోరాడిన యువత నేడు సాధించుకున్న రాష్ట్రంలో సరికొత్త జీవితాలను ప్రారంభించాలని ఆశగా ఎదురుచూస్తుంది. తెలంగాణ బరిగీసి పోరాడి అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడటంలో సఫలమైన ఉద్యమపార్టీ టీఆరఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టిన సందర్భం ప్రతి ఎలక్షన్లలో ప్రతిబింబిస్తున్నదే.             ఇక ఇప్పుడు తెలంగాణకు సరికొత్త ఆశదీపంగా కనిపిస్తున్న ఒకే ఒక్క పేరు కేటీఆర్. నిజానికి తెలంగాణ సామాన్యులకు టెక్నాలజీని దగ్గరగా చేసేందుకు విశ్వప్రయత్నంచేసి సఫలం అయిన ఐటీ మంత్రి.. టీహబ్, టాస్క్ ద్వారా తెలంగాణ యువతకు, విద్యార్ధులకు మెరుగైన జీవితాన్ని ప్రసాదించాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ ప్రయత్నంలో కేటీఆర్ అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. భారత దేశంలో అత్యున్నత పరిపాలనను చేస్తున్న నాయకులకు ఇచ్చే మోస్ట్ ఇన్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ మొదటి సంవత్సరంలోనే సొంతం చేసుకున్నాడు. అంతేకాదు బిగ్ బెస్ట్ స్టేట్ అవార్డ్ ఇన్ ఇనఫ్రాస్ట్రక్చర్ అవార్డ్ –...

అవకాశాల వారధి టీ-హబ్

చిత్రం
హైదరాబాద్ టీ హబ్ తో కలిసి దేశంలో స్టార్టప్ ల ఎదుగుదలకు కృషి చేస్తామని మైక్రోసాఫ్ట్ సీ.ఈ.ఓ సత్యనాదేళ్ల తెలిపారు. నాదేళ్ల మాట్లాడుతు.. దేశంలో ప్రభుత్వ (తెలంగాణ ప్రభుత్వ), ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్వహించబడుతున్న అతిపెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్ హైదరాబాద్ టీ-హబ్  అని.. ఇందులో ప్రసిద్ధి చెందిన ఐఐఐటీ-హై, ఐఎస్బీ  నాల్సార్ లాంటి సంస్థలతో పాటు అనేక ప్రైవేట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. ఇది కేవలం కేటీఆర్ ఆలోచన ఫలితమేనని వ్యాఖ్యానించారు.                 ఔత్సహిక ఎంటర్ ప్రెన్యూర్ లను ఉద్ధేశించి మాట్లాడుతూ.. ప్రపంచ ఐటీ రంగంలో భారతీయులు తమ అపార ప్రతిభాపాటవాలతో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని విశ్లేషించారు.                 అంతే కాదు.. దేశంలో  స్థానిక పారిశ్రామికవేత్తలను అభివృద్ధి సాధించేట్టు చేయడం ద్వారా అట్టడుగు స్థాయి వరకు టెక్నాలజీని తీసుకెళ్లడమే మైక్రోసాఫ్ట్ ధ్యేయంగా ముందుకెలుతుందని తెలిపాడు.

సురక్షిత శబరి యాత్రకు మార్గం ఇదే

అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కోట్లాది మంది తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తుంటారు. అయితే ప్రయాణం దగ్గరి నుంచి మొదలుకొని అకామిడేషన్, దర్శనం వరకు ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతుంటారు. అంతేకాదు భాషకు సంబంధించిన సమస్య మన తెలుగువారికి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి భక్తులందరు శబరిమల, పంబాకు సంబంధించిన అధికారుల ఫోన్ నంబర్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీ.ఆర్.ఓ నంబర్ ను వెంట తీసుకెళ్లాలి. దీంతో ఎదైన సమస్య వచ్చిన అధికారులను సంప్రదించి ఈజీగా ముందుకు వెళ్లవచ్చు.                 తెలంగాణ ప్రభుత్వం మరో పది, పదిహేను రోజుల్లో ఒక అధికారిక సహాయక బృందాన్ని శబరిమలకు, పంబాకు పంపించే ఏర్పాటు చేస్తుంది. మరికొద్ది రోజులలో ప్రభుత్వం పెట్టే టోల్ ఫ్రీ నంబర్ ను, పీ.ఆర్.ఓ నంబర్ ను మీకు అందించేందుకు నాకు తోచిన ప్రయత్నం చేస్తాను స్వామియేయ్ శరణం అయ్యప్పా........ Shabarimal Executive Officer Fax Number - 0473-5202012

తెలుగులో నేను నిర్మించిన కొత్త మాట‌

మిత్రులారా..? నేను నా వృత్తిరిత్యా నేను ఓ తెలుగు ప‌దాన్ని నిర్మించే ప‌ని చేప‌ట్టాను. అందులో భాగంగా నేను నిర్మించిన కొత్త ప‌దం ఈవ్ టీజింగ్ = స్త్రీ దుర్ వేధింపులు లేదా స్త్రీ దుర్వేధింపులు లేక మ‌హిళాదుర్వేధింపుల చ‌ట్టంగా ఉంటుంద‌ని భావించాను. ఎందుకంటే ఈవ్ అనే ఇంగ్లీష్ ప‌దానికి సంద‌ర్భం అని అర్థం. టీజింగ్ అనే ప‌దానికి వేధింపులు లేక బాధించుట అని అర్థం ఉంది.  అయితే ఇంగ్లీష్ భాష యొక్క స‌ర‌ళ‌త్వం దృష్టా అది క‌చ్చితంగా మ‌హిళ‌ల‌ను వేధించ‌డ‌మే అనే అర్థం అంద‌రికి తెలిసిపోయింది. అదే ప‌దాన్ని స‌రిగ్గా తార్జామా చేస్తే వేధింపుల సంద‌ర్భం , బాధింపుల సంద‌ర్భం అనే అర్ధాలు వ‌స్తున్నాయి. కానీ ఇది ప‌ల‌క‌డం చాలా ఎబ్బెట్టుగా, అసంద‌ర్భంగా ఉంటుంది. అంతేకాదు వేధింపులు అంటే తెలుగులో విశాల‌మైన అర్థం క‌లిగిఉంది. కాబ‌ట్టి ఎవ‌రిని వేధిస్తున్నారు అనే విష‌యం కూడా తెలియాలి. అంతేకాదు ఇది స‌త్‌సాంప్ర‌దాయం కానందున దీన్ని దుర్ అనే ప‌ద ప్ర‌యోగం వాడ‌టం స‌రిపోతుంద‌ని నా మ‌న‌సుకు తోస్తుంది. అందుకే ఎవ‌రిని వేధిస్తున్నారో తెలిసేలా.. టీజింగ్ అంటే వేధించుట‌ అది మంచి ప‌ని కాద‌ని తెలిసేలా ద‌ర్ నే విష‌యాన్ని చెప్ప‌డం. ...

తెలంగాణ గ్రౌండ్ వాట‌ర్ మెనేజ్‌మెంట్‌లో ఉద్యోగ‌వ‌కాశాలు-

చిత్రం
       తార్నాక (సికింద్ర‌బాద్‌)లోని  స‌స్టైనెబుల్ గ్రౌండ్ వాట‌ర్ మెనేజ్‌మెంట్‌లో  ప్రాజెక్ట్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగానికి నోటిఫికేష‌న్ వెలువ‌డింది.      క‌న్స‌ల్టెంట్ ఉద్యోగానికి అర్హ‌త‌లు - జ‌ర్న‌లిజం/క‌మ్యూనికేష‌న్స్/ సొష‌ల్ సైన్సెస్‌లో  పీజీ ఉత్తిర్ణత ఉండాలి. రిక్రూట్‌మెంట్ - ఇంట‌ర్వూ ప‌ద్ద‌తిలో జ‌రుగుతుంది. అప్లై చేయాడానికి చివ‌రి తేది - అక్టోబ‌ర్ 13 చివ‌రి తేది (అక్టోబ‌ర్ 13 లోపు ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి) అప్లై చేయాల్సిన ఈమెయిల్ ఐడీ - careers@cwsy.org. ఆఫీస్ చిరునామా - CWS-suGWM Project                              12-13-451, street No-1,                                 TARNAKA,                                SECUNDERABAD,                 ...

డియ‌ర్ ఫ్రెండ్స్‌..

చిత్రం
          దేశంలోనే ప్ర‌ముఖ ప‌రిశోధ‌నా సంస్థ‌గా పేరొందిన టాటా ఇనిస్టిట్య్టూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రీస‌ర్చ్ లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల‌కు నోటీఫికేష‌న్ వెలువ‌డింది. ఉద్యోగాన్వేష‌న‌లో ఉన్న మిత్రులు ఓసారి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌ల‌సిందిగా విన్న‌విస్తున్నాను. థాంక్యూ ఫ్రెండ్స్‌.. మీ శ్రీ‌పాద ర‌మ‌ణ‌

సులువైన ఇంగ్లీష్ కోసం ఆరు మార్గాలు

చిత్రం
మార్గం -1                ఎప్పుడు ఇంగ్లీషు భాష‌లో ఒంట‌రి ప‌దాలను చ‌ద‌వ‌కూడ‌దు.                జ‌ట్టుగా ఉన్న ప‌ద‌బంధాల‌ను చ‌ద‌వాలి.                అంతేకాదు చిన్న పేరాగ్రాప్‌ల‌ను ఇష్టంగా చ‌ద‌వాలి.                ఒక‌టికి ప‌దిసార్లు రాస్తూ చ‌ద‌వాలి. మార్గం -2.                ఉచ్ఛ‌ర‌నే ఉత్త‌మ మార్గం -                అంటే చూసిన ప్ర‌తి ప‌దాన్ని ఉచ్ఛ‌రించాలి.                క‌లిసిన ప్ర‌తి మ‌నిషితో ఇంగ్లీషులోనే మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించాలి. మార్గం-3.               వ్యాక‌ర‌ణం ద్వారా మాత్ర‌మే ఇంగ్లీష్ వ‌స్తుంద‌నుకోవ‌డం భ్ర‌మ మాత్ర‌మే -                              తెలుగు మాట్లాడే ప్ర‌జ‌లంద‌రికి సంధ...

ఎక్క‌డ‌మ్మా..ఓ చినుక‌మ్మా..?

చిత్రం
 నాగ‌టి క‌ర్రుకు ఎరుక‌  నానిన భూదేవి సంగ‌తి..  మ‌ట్టిలో మునిగిన విత్తుకు ఎరుక‌  కురిసే వ‌ర‌ణుడి ఒర‌వ‌డి..  ఆకాశంకేసి ఎదుగుతున్న మొక్క‌కు ఎరుక‌  లేలేత కిర‌ణాలను వెద‌జ‌ల్లుతున్న సూరీడి  వాడీ.. మ‌రి మేఘ మ‌ధనాల‌కు ర‌సాయ‌న ప్ర‌యోగాలకు  అందునా ప్ర‌కృతి ఒడి అది వీడ‌ని చిక్కుమ‌డి.            ###              ఆకాశంకేసీ చూడ‌కు  భూమాత‌ను చూసి బెద‌ర‌కు నెర్రెలుబార‌డం.. వ‌ర‌ద‌లుపార‌డం స్టెప్ బై స్టెప్‌ అతివృష్టిలు.. అనావృష్టిలు ఎన్న‌టికైనా ట‌ఫ్‌. కాలాన్ని ఆప‌డం నాసా రాకెట్ వ‌ల్ల‌వుతుందా..? ఇస్రో సాటిలైట్ వ‌ల్ల‌వుతుందా..? చెప్ప‌డం కాస్త క‌ష్టం అదంతా మిస్ట‌రీ అని చెప్ప‌డం ఇష్టం.                                                                           ...

ఆర్య‌భ‌ట్ట పుట్టిన నేల‌పై ఆడుగంటిపోతున్న ప్ర‌తిభ‌

చిత్రం