పోస్ట్‌లు

చెప్పేవి శ్రీరంగ నీతులు.. చెసెవి... ?

చిత్రం
చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసెవి... ?  ఆంధ్రజ్యోతిలో  కోదండరాం  ఢిల్లీ పర్యటన గురించి రసిఅన వ్యాసం కోసం ఈ  లింక్ పై క్లిక్ చెయ్యండి .  http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/08/18/ArticleHtmls/18082013002019.shtml?Mode=1

గెలిస్తే పూల బాట .. ఓడితే ముళ్ల బాట.. ఇదేం నీతి ?

చిత్రం

జోరు తగ్గించు సారూ ...

చిత్రం

బ్లాగ్ మిత్రులారా మీకు హృదయపూర్వక నమస్కారాలు

బ్లాగ్ మిత్రులారా మీకు హృదయపూర్వక నమస్కారాలు        మరి కొద్ది రోజులలో నా యొక్క తెలుగు వార్తల వెబ్ సైట్ ప్రారంభం కాబోతున్నది.  నా యొక్క సైట్ లో అనేక విషయాలతో పాటు.. తెలుగు భాష కోసం.. సంస్కృతిక వికాసం కోసం కృషి చేస్తున్న  అనేక మంది బ్లాగర్ల యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి నా వంతుగా తెలియ చేయాలని తలస్తున్నాను. కావున బ్లాగ్ ద్వారా భాష అభివృద్దికి.. సామజిక చైతన్యం కోసం కృషి చేస్తున్న వారి వివరాలను నాకు మెయిల్ చేస్తే నా యొక్క సైటులో వారి బ్లాగ్ కి సంబందించిన కృషిని వివరించడం జరుగుతుంది. అంతే కాదు సామజిక చైతన్యం కలిగించే వ్యాసాలు రాయగల మిత్రులు ఎవరైనా వ్యాసాలను పంపితే మీ పేరు మీద ప్రచురించడం తో పాటు.. శక్తి మేర పారితోషికం ఇవ్వబడు తుంది.  వ్యాసానికి ఉండాల్సిన లక్షణాలు ; ----------------------------------------- * తెలుగు భాష అభివృద్దికి తోడ్పడేలా ఉండాలి . లేదా తెలుగు చరిత్రను తెలియ చేసేలా ఉండాలి.( ఏ      ప్రాంత మాండలికమైన ఫర్వాలేదు )  * సామజిక చైతన్యం కలించే వ్యాసాలకు పెద్దపీట వేయడం జరుగుతుంది.  * నాటకం , కథ , కవ...

మాకొక గాంధీగిరి కాలనీ కావాలి..!

చిత్రం
           అవును మాకొక గాంధీగిరి కాలనీ కావాలి..! ఒక పక్క రెండు వర్గాల ప్రజల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు  అవే రెండు వర్గాల ప్రజలు ఒకరికి ఒకరంటూ ఒక అంతిమ యాత్రలో పాల్గొన్నారంటే వాళ్ళ మధ్యలో ఎంత ప్రేమ అనూరాగాలు.. నమ్మకాలు ఉండాలి. నిజంగా ఆ వార్త చదువుతున్నప్పుడు కళ్ళలో  నీల్లు తిరిగాయి..ఒకింత బాధ కూడా వేసింది.. ఎందుకంటే మతం మాట వినపడితే పూనకం వచ్చినట్లు మారిపోతున్న మనుషులు గాంధీగిరి కాలనీవాళ్ళలా ఎందుకు ఆలోచించడం లేదని.              ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ కి మరిన్ని గాంధీగిరి కాలనీ లు కావాలి.

ఓ స్త్రీ రేపు రా ..!

చిత్రం
     ఒక దశాబ్ద కాలం క్రితం ఆంద్రప్రదేశ్ లోని పల్లెల్లోని ఏ ఇంటి గోడలపై చుసినా  'ఓ స్త్రీ రేపు రా ' అనే  రాతలు కనిపించేవి. అప్పట్లో ఎవరో ఆడ దెయ్యం పల్లెల్లో తిరుగుతుందని ఆమె వారి ఇళ్ళ ముందు రాసిన మాటల్ని చదివి మరుసటి రోజు వస్తుందని.. అలా ఎప్పుడు వచ్చినా రేపు రా అని రాసింటుంది కాబట్టి ఆ దెయ్యం తమల్ని ఏమి చెయ్యదని నమ్మేవారు..          ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చౌక ధరల టాబ్లెట్ పీ సీ ఆకాశ్ పరిస్థితి అలాగే ఉంది. గతంలో ఆకాశ్ నెం 1 విడుదల చేసినప్పుడు కపిల్ సిబాల్ గారు రాబోయే సంవత్సర కాలంలో కోటి మంది విద్యార్ధులకు ఆకాశ్ ను అందిస్తామని చెప్పారు.కానీ వాస్తవంలో ఒక్క నరేంద్రమోడికి తప్ప దాన్ని చూసే భాగ్యం ఎవరికీ కలగలేదు ( ఆకాశ్ టాబ్లెట్లు అకాశం లో  తప్ప భూమి మీద కనిపించడం లేదంటూ ఎద్దేవా చేసినందుకు .. స్పందించిన కపిల్ సిబాల్ గారు ఇదిగో ఆకాష్ అంటూ పంపించారు అది తప్ప ఇప్పటి వరకు నేను ఆకాశ పీ.సీ ని చూశానని చెప్పిన మానవుడే లేడు )  కానీ  స ర్కారు ఇప్పుడు ఆకాశ్ -2 ...

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ..?

చిత్రం
      ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే సోనియా గాంధీ ఫ్యాషన్ పాఠాలు చెప్పడం కొత్తే కావచ్చు.. కానీ  అన్ని నిజాలే చెప్పింది..మనస్సులో ఉన్న విషయాల్ని బయట పెట్టింది. కోరికల కోసమే పుట్టినట్టు బ్రతికే కొందరు సో కాల్డ్ ఆడవాళ్ళూ చెయ్యబట్టి దేశం లో బంగారం రేటు 32000/- వేలకు చేరుకుంటే..ప్రపంచ హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ లో 134 వ స్థానానికి దిగజారింది. అయిన ఇంకా చాలదన్నట్టు.. లంగా వోనిలకు గుడ్ బై చెప్పి.. బికినీ.లేగ్గింగ్ లకు జై కొడుతున్నారు... ఎంతో సంప్రదాయంగా ఉండే పంజాబీ డ్రెస్ చున్నిలను.. స్కార్ఫ్ గా మార్చేసారు. అంతేనా అంటే అక్కడితో చాలదన్నట్టు..స్లీవ్ లెస్..స్కిన్ టైట్లతో వేలం వెర్రి చేష్టలు చేస్తున్నారు.         అంటే అమ్మాయిలను అన్నమంటారు కానీ.. ఈ దేశాన్ని పరదీనం లోకి నెడుతున్నది అమ్మాయిలు కాదా అన్నది సగటు అబ్బాయిల ప్రశ్న ?? పంచలు.. లాల్చిలు మారిపోవచ్చు కానీ వొల్లంత బట్టలు కట్టుకునే సాప్రదయాన్ని కాపాడేది ఒక్క మగల్లెనన్నది కోటిమార్లు నిరూపణ అయిన నిజం..             ఇక అమ్మాయిలు..  ఆడంబరాల కోసం...

డ్రాగన్ దెబ్బకు....తుస్ !

చిత్రం
      చైనీయుల చోరకళ  ముందు.. ప్రపంచం లో ఎవ్వరైనా దిగదుడుపేనని నిరూపించింది ఆసోచాం సర్వే. అతి పవిత్రంగా జరుపుకునే దీపావళి పండగ అంటే భారత దేశంలో ఒక క్రేజ్.  ఇక దీపావళి టపాసులంటే ఓ స్పెషల్. అందుకే ప్రపంచంలో మరే దేశంలో లేనంత ఫైర్ వాల్స్ డిమాండ్  భారత దేశంలో ఉంది. వందల కోట్ల వ్యాపారం ఒక్క సెషన్ లో జరుగుతుంది.      సరిగ్గా వీటిపైనే చైనీయుల కన్ను పడింది. కాపీ కొట్టడంలో డబుల్ పీహెచ్ డీ  చేసిన చైనా చోర్ బ్యాచ్ మన దేశం లోని అన్ని రకాల టపాసులను వాటి పై ఉండే హిందూ దేవతల బొమ్మలతో సహా కాపి కొడుతుంది. అంతే కాదు వాటిని అతి తక్కువ ధరకే మన మార్కెట్ లోకి వదులుతుండటం.. తక్కువ ధరకే దొరికే వస్తువులను విరగబడి కొనే మన సగటు జనం 74 % చైనా  టపాసులను కొనడానికి ఆసక్తి చుపిస్తుండటంతో మన దేశీయ టపాసుల వ్యాపారం తుస్సుమంటుంది. అంత ఇంత కాదు 1800 కోట్ల రూపాయలు అక్రమంగా చైనాకు తరలి పోతున్నాయి.. చైనా అక్రమ సరుకుకుల మూలాన దేశీయ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని అసోచాం నివేదిక స్పష్టం చేసింది.  ఇప్పటికైనా అధికారుల...

నిజమైన మనిషి ప్రతినిధి బికారీ బాబా..!

చిత్రం
       కళ్ళ ముందు మనిషి ప్రాణాలు పోతున్నా బిస్లరి బాటిల్ నుంచి ఒక్క చుక్క నీళ్ళు దానం చేయని మనుషులున్న ఈ కాలం లో బికారీ బాబా లాంటి ఒక మహానుభావుడు ఉన్నాడంటే నిజంగా అద్భుతమే. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఫ్యాక్షనిజం..హీరోయిజం చూపించుకుంటున్న నాయకులున్న ఈ రోజుల్లో బిక్షమేత్తుకుని దీనులకు సేవ చేసే ఒక లీడర్ ఉన్నాడంటే మిరాకిలే మరి. అందుకే బికారీ బాబా సంతింగ్ స్పెషల్ గెస్ట్ గా ఈ వ్యాసం చదవండి.

ఈ కల్తీ దేశంలో...

చిత్రం
       గోదారి నీళ్ళు, స్వచ్చమైన గాలి, మండే నిప్పు, జీవరాశిని కాపాడే ఓజోన్ పొర, తినే తిండి, కట్టుక్జునే బట్ట ఇలా చెప్పుకుంటూపోతే ఈ దేశంలో అన్ని కల్తీనే.. ఒక్క  అమ్మ పాలు  తప్ప.                 ప్రశాంతంగా ఉండాల్సిన నేల తల్లి, మూగ జీవాలు మనిషి స్వార్ధంతో మనుగడను కోల్పోతున్నాయి. అవసరం ఉన్న లేకున్నా ప్రతిదాన్ని విచ్చలవిడిగా వాడే మానవుని వైకరి మూగ జీవాల ఉసురు పోసుకుంటున్నది.అందుకు మంచి ఉదాహరణే ఈ వార్త కథనం.            అంతే కాదు మోతాదుకు మించి వాడుతున్న రసాయనాలు సహజ ఎరువులుగా పనిచేసే రైజోబియం లాంటి బాక్టీరియాలను చంపేస్తున్నాయి. ఇవే కాదు ఇంకా అనేక రకాల మనవ ఉపకారులు మనిషి స్వార్ధానికి బలైపోతున్నాయి. ఈ విధానం ఇలానే కొనసాగితే మనవ జాతి అంతం కావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.  

వివాదంలో దేనికైనా రెడీ..!

చిత్రం
వివాదంలో తెలుగు సినిమా రంగం..  దేనికైనా రెడీ అంటున్న బ్రాహ్మణులు. హీరోల వెకిలి ఆలోచనలతో.. డైరెక్టర్ల సృజనాత్మక లోపాలతో తెలుగు సినిమా రంగం వివాదాలకు..వెకిలి వేషాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది.. మొన్నటికి మొన్న తెలంగాణా ప్రజల మనసులకు గాయం చేసిందని ఓ సినిమాపై పెద్ద దుమారం రేగి సర్కారు జోక్యం తో 16 కట్లతో బయటపడ్డ ఆ సినిమా ఇప్పటికి కోలుకోలేక పోతుంది.    ఆ వివాదం మరువక ముందే మంచి విష్ణు నటించిన దేనికైనా రెడీ బ్రాహ్మణుల ఆగ్రహావేశాలతో విలవిల్లాడిపోతుంది. బ్రహ్మనులపై విష్ణు అనుచరులు కర్రలతో దాడి చేసి గాయపరచడంతో.. బ్రాహ్మణ ప్రతినిధులు విష్ణు పై చెప్పులు విసిరి నిరసన వ్యక్తం చేసారు.         ఒకరి మనసులు గాయం అవుతాయి అనుకున్నప్పుడు..ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి అనుకున్నప్పుడు అలంటి సినిమా ఎందుకు తీయాలి. సినిమా అనేది క్షణిక ఆవేశం కాదు.. అనుకోకుండా తీసాం అని సర్ది చెప్పుకోవడానికి.. కొన్ని నెలలపాటు షూటు, రీషూట్లు చేసే సినిమాల్లో వివాదాలు ఉండటం కచ్చితంగా కావాలనే తీసారని భావించవలసి వస్తుంది. ఇంకా కొందరు జ్ఞాన శూన్య దర్శకులు కావాలనే...

నువ్వొక ఒంటరివి..!

చిత్రం
దేశం లో  జనం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న  మనుషులు మాత్రం ఒంటరవుతున్నారు .. ఏది తేకున్న అన్నీ కోల్పోయినట్టు.. అంతా నాశనం అయినట్టు.. వెలుగులు విరజిమ్ముతున్న కాలం  కారు చికట్లలో మగ్గినట్టు.. బంధాల దొంతర ఎడబారినట్టు.. మనిషనే మమతను  కిలోమీటర్ల కింద పతిపెట్టినట్టు.. ఎక్కడికో పయనం.. మరెక్కడో గమ్యం..!! కత్తుల సావాసం కటకటలా నెడితే.. అమ్మ కాదుకదా దాని జేజమ్మ వచ్చినా కాపాడలేదు.. న్యాయం నీన్ను విడిస్తే. గుర్తుంచుకో బ్రదర్  మంచి ముందు కస్టపెడుతుంది.. చెడు తర్వాత చుక్కలు చూపిస్తుంది.. దాని బారిన పడితే ఎండ్ లేదు. క్యాష్ కోసం క్యారెక్టర్ చంపుకుంటే.. దానమ్మ అది ... నువ్వు చెంచల్ గూడ జైల్లో ఉన్న వదిలిపెట్టాదు.. నిన్ను అధపాథలం తోక్కేదాకా. కాసులకున్న కమిట్మెంటే అది మరి. మనం సృష్టించిన మనీనే కదా అని  ఆటలడేవు సెహ్వాగ్ సిక్స్ లాగ నిన్ను  లైఫ్ బౌండరి బయటికి విసిరికోడతది. అయినా నా ఇష్టం అంటే    అది నీ ఇష్టం సోదరా.. తినే పిడికెడు తిండి కోసం.. విలువల వలువలుడదీసి.. చెర్నాకోల చేతబట్టి మానవత్వం వీపుపై విమానం మోగించి.. ఏం సా...

ఎక్కడికి వెళ్ళావు బంగారం..?

చిత్రం
                              అమ్మ గోరుముద్దలు కలిపి                      నీ కోసం ఇల్లంతా గాలిస్తుంది..                     వా..న్                      టూ..                     త్రీ..                      ఎక్కడ ఉన్నా మా సాన్వి తల్లి రావళి..                     అంటూ నీతో ఆటలాడిన నీ జ్ఞాపకాలతో                      వల వల ఏడుస్తుంది..                     నీ చిట్టి పొట్టి మాటల కోసం...                     కన్నీరు మున్నిరుగా విలపిస్తుంది. ...

ఈ విజయం భావితరాల కోసం ..!

చిత్రం
            బడి పిల్లలపై పరీక్షలు పెను భారాన్ని మోపుతున్నాయి. తల్లితండ్రుల ఆలోచనలను క్యాష్ చేసుకునేందుకు విద్య సంస్థలు టాలెంట్ టెస్ట్ ల పేరుతో విద్యార్దులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఒకవైపు రోజు వారి విద్య విధానమే యాంత్రికమై ఆట పాటలు లేకే పసిమొగ్గలు తల్లడిల్లి పోతుంటే..ఈ టాలెంట్ టెస్ట్ లు చిన్నారుల పాలిట గుదిబండలుగా తయారయ్యాయి. అమ్మల ఆత్మీయ ఆలింగనం..నాన్నల అపురూపమైన స్పర్శలు కరువయ్యి చిన్నారులు హింసాత్మక ఆలోచనల వైపు మగ్గుతున్న విషయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆ వైపుగా ఆలోచించే తీరిక ఎవరికీ కలగక పోవడం భాదకరమే.              చిన్నారుల పై విద్యా సంస్థలు మోపుతున్న టాలెంట్ టెస్ట్ ల ఒత్తిడిని నిలిపి వేయాలంటూ బాలల హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసింది. రియాలిటి షో లలో చిన్నారులను వేధించడం నేరమని తీర్పు ఇచ్చినట్టుగానే.. టాలెంట్ టెస్టులను నిషేదించాలని తీర్పునివ్వాలని మనస్పూర్తిగా కోరుకుందాం. 

ఈ దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం లో..!

చిత్రం
              దోచుకున్నవాడికి దోచుకున్నంత..ఈ పదం నేటి రాజకీయాలకు అతికినట్టు సరిపోతుంది. ఎలక్షన్ల ముందు నామినేషన్ పత్రంలో అప్పులు, ఆవకాయ ముక్కలు తప్ప తమ దగ్గర ఏమి లేవని చిలుక పలుకులు పలికే నాయకులు.. ఒక్కసారి గెలవగానే రాత్రికి రాత్రి వేలకోట్లకు అధిపతులు అవుతున్నారు. మంత్రాలు లేవు.. మాయలు లేవు.. అంత మా చెమట చుక్కల ప్రతిఫలమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అసలు ఎం పని చేస్తే ఒకటి , రెండు ఏళ్లలో వేల కోట్లు సంపాదించాచ్చో చెబితే అందరు అదే పాటిస్తారు కదా ..? 

అక్షరం కోసం కర్కశత్వాన్ని ఎదురించిన వీర నారి మలాల..!

చిత్రం
              పుస్తకమంటే ఎందుకు తల్లి నీకు అంత ప్రేమ ??              బుల్లెట్లు ఎదురోస్తున్నా అక్షరాలను ముద్దాడలనుకున్న..              నీ గుండె దిటవు ముందు..              బోసి నవ్వుల నీ అమాయకత్వం ముందు               కర్కశత్వం ఓడిపోయింది..              రాక్షసత్వం తోకముడిచింది తల్లీ .                                                నీకు దిగిన ఒక్కొక్క బుల్లెట్టు.. సూర్యుడి  వలే...                  తాలిబాన్ల చీకటి రాజ్యాలను చీల్చేస్తుంది..            అరాచక వ్యవ...

దోచుకోవడం.. దాచుకోవడమే వారి పని..

చిత్రం
      రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించినంత పని చేసిన బ్రిటీష్ వాళ్ళు.. ప్రపంచం లోని దాదాపు అన్ని దేశాల సంపదతో పాటు.. విజ్ఞాన సర్వస్వాన్ని దోచుకుపోయారు. అయితే బ్రిటీష్ పాలకుల బానిసత్వం లోని అన్ని దేశాలు.. స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాక  .. తమ సాంస్కృతిక చిహ్నాలను తిరిగితెచ్చుకున్నాయి.అంతే కాదు తమ మేధో సంపత్తితో సృష్టించిన అనేక అద్భుతాల హక్కులను సాధించుకున్నాయి. కానీ విశాలమైన భారతావని మాత్రం ఆ పని చేయలేక పోతుంది. పాలకుల నిర్లక్ష్యం..పరిశోధకుల నిర్లిప్తత మన ఆవిష్కరణలకు ప్రమాడం లోకి నేట్టేస్తున్నాయి.         నిన్న మొన్నటి వరకు.. పసుపు, వేపాకు, కుంకుమ పువ్వు, కరివేపాకును తామే కనుగొన్నామని తెల్లోల్లు అంతర్జాతీయ పేటెంట్ కోసం అప్లై చేసేదాకా కూడా మనవాళ్ళు ఆ సంపద తమదని పేటెంట్ తీసుకోక పోవడం నిజంగా సైంటిస్టుల తప్పిదమే. పరిశోధనల మీద వేల కోట్లు దారపోస్తున్న ఒక్క ఆవిష్కరణ కొత్తది లేకపోవడం కలవార పరిచే నిజం.         ఎందరో భారతీయ మేధావులు తమ అద్బుత మేధోశక్తితో  రాసిన అమూల్యమైన అనేక గ్రంధాలు విదేశీ లైబ్రరీలలో...

గుర్రం గడ్డకు కష్టాలు ఎన్నాళ్ళు బిడ్డ..??

చిత్రం
               మా అభివృద్ధి స్పీడును అందుకోలేక చిరుతపులే పోటినుంచి తప్పుకున్నదంటారు.. ఏ దేశం పోయిన అభివృద్ధి అంటే మీదేనని తెగ పోగుడుతాండ్రని కోతలు కోస్తారు.. లక్షల కోట్ల బడ్జేట్ పెట్టి తెగ సంక్షేమం తేచ్చినమని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేస్తారు... ఏది మీ అభివృద్ధి ?? ఏ  గంగల కొట్టుకు పోయింది.. ఏ  గోదారిలో మునిగిపోయింది..?? రాష్ట్ర రాజధాని కి కూతవేటు దూరం కూడా లేని గుర్రం గడ్డ బిడ్డలా కష్టాలకు ఈ పాలకులు ఎం సమాధానం చెప్తారు ??                  ఇది ఒక్క గుర్రం గడ్డ సమస్య మాత్రమే కాదు యావద్ రాష్ట్ర సమస్య కూడా... గుర్రం గడ్డ .. ఆదిలాబాద్ జిల్లాలోని బాబుల్ గావ్.. తో పాటు ఇంకా అనేక గ్రామాలూ సరైన దారి లేక.. తాగేందుకు మంచి నీళ్ళు లేక విలవిల్లడుతున్నాయి.  ప్రభుత్వ సహాయం కోసం వెయ్యి కళ్ళతో ఎదిరి చూస్తున్నాయి. బిల్డింగుల బిల్డప్ తో అబివృద్ధి సాధించినమని తొడలు కొడుతున్న పాలకులు ఒక్కసారి గుర్రం గడ్డ ను చూస్తే అభివృద్దిలో మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది....

దోపిడీ రాజ్యం లో నీతి, రీతికి చోటెక్కడ ??

చిత్రం
           రాజకీయాల్లో నాయకులతో లబ్దిపొందిన వాడు చేసే చెక్క భజనే ఆ నాయకుడి ప్రతిభకు గీటు రాయిగా మారిన రాష్ట రాజకీయాల్లో  దేవుడి పాలనా ఏదో.. రాబందుల పాలన ఏదో జడ్జమెంట్ ఇవ్వలేని కన్ఫ్యుషన్ కాలం ఇది. దేవుడి పాలనా అంటూ ఉదరగోట్టిన నాయకులూ , పార్టీలు ఆ జమానాలో జరిగిన దింపుడుకళ్ళం కార్యక్రమాలకు ఏం సమాదానం చెబుతారో మరి.   నాయకుడి అండతో ఐ.ఏ.ఎస్ లను సుస్సు  పోయించిన  దోపిడీ ఏజెంట్ గురించి ఏ విదంగా అర్ధం చేసుకోవాలో మరి ??          

తుగ్లక్ రాజకీయాలు...

చిత్రం
                                                                     రాష్ట్రoలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయీ.. ఎవరు ప్రతిపక్షమో ఎవరు అధికార పక్షమో తెలియని అయోమయం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఒక వైపు చెంచల్ గూడ జైలును జగన్  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసాడని ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. అధికార పక్షం లోని నేతలు ప్రభుత్వదినేతపై విమర్శలు ఎక్కుపెట్టిన స్పందించని ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ కోసం..అధినేత సోనియా కోసం జీవితాన్ని అంకితం చేస్తాననే పరమ  భక్తుడైన  శంకేర్ రావు ఇంటిపై పోలీసులను ఉసిగొల్పి వీరంగం సృష్టించడం సీ ఎం గారి పనేనని కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్నాయీ. అంతే కాదు వేల కోట్లు మింగిన జగన్ను కంటికి రెప్పల కాపాడుతూ.. పార్టీ కోసం బతికే శంకేర్ రావు ను వేదించటం ...